ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబోరు తన కుట్రలు కుతంత్రాలకు శాసన మండలిని అడ్డంగా వాడుకున్నారన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. కేవలం తన ఆస్తులను కాపాడుకోవాలన్న దురాశతోనే ఈ తరహా వైఖరిని అనుసరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న హై కోర్టు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.    పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణల బిల్లులపై చట్ట సభల్లో చర్చలు జరుగుతున్న తరుణంలోనే హైకోర్టు విచారణ చేయబోదని, చెప్పిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం రద్దు తదితర నిర్ణయాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు రిట్‌పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎవి.శేషసాయిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వంలో చర్చనీయాంశగా మారంది. ఆ రెండు బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్లను విచారించేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక బెంచ్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జికె.మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి.శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో ఏర్పాటైన ఈ విస్తృత ధర్మాసనం గురువారం నుండి విచారణ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలుత పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ అశోక్‌ భాన్‌ వాదించారు. వికేంద్రీకరణ చేసే అధికారం రాష్ట్రానికి లేదని, . కేంద్రం ఆ పనిచేయాలని రాష్ట్రపతి ఆమోదం ఉండాలని ఆయన వాదించారు. సీనియర్‌ న్యాయవాదులను నియమిరచుకునే పనిలో పడింది. ఈ వాజ్యాలపై ప్రభుత్వం తరఫున వాదిరచేరదుకు తాజాగా సీనియర్‌ న్యాయవాది, మాజీ జాతీయ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని నియమిరచుకున్నారు. ఇతనికి రూ. ఐదు కోట్ల భారీ ఫీజును ఇవ్వాలని నిర్ణయిరచారు. ఇందులో అడ్వాన్స్‌గా రూ.కోటి ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల అభిప్రాయాలను కూడా సక్రమంగా తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరో లాయర్‌ మురళీధర్‌రావు వాదిస్తూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కిందని, నియంతలా వ్యవహరిస్తోందని చెప్పారు.  ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ వాదిస్తూ.. రెండూ సాధారణ బిల్లులేనని, ద్రవ్య బిల్లులు కాదని, రెండు సభల్లోనూ సాధారణ బిల్లులుగానే ప్రవేశపెట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు. ద్రవ్య బిల్లు కాదన్న ఎజి వాదనను హైకోర్టు రికార్డుల్లో నమోదు చేయాలని పిటిషనర్‌ లాయర్‌ కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: