శాసన మండలిలో ఎదో సాధించామని చంకలు గుద్దుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్న బాబోరు గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనుకోవడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలకు నిరసనగా నేడు అసెంబ్లీకి వెళ్లకూడదని తెదేపా నిర్ణయించుకుంది. దీనిపై చంద్రబాబు వైఖరేంటో తెలతెల్లమవుతుందన్న వాదన వినవస్తుంది.  మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దును మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తోంది. అందుకే శాసనసభలో అడ్డుకునే పని చేసింది. అయినా బిల్లు పాసైంది. ఇప్పుడు మండలిలో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందుకు రూల్ నెంబర్ 71ను తీసుకువచ్చింది. అసలు ఆయన నిన్న మండలిలో ఏ సాధించారో ఒక సారి పరిశీలిద్దాం. 
  
సెలక్ట్ కమిటీకి కాలపరిమితిని మండలి ఛైర్మన్ నిర్ధేశించవచ్చు.బిల్లు ప్రవేశపెట్టిన మంత్రే సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ గా ఉంటారు.సభలో బలాబలాల ప్రకారమే సెలెక్ట్ కమిటీని నియమిస్తారు. బిల్లుపై సెలక్ట్ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించి సవరణలు సూచించవచ్చు. సెలక్ట్ కమిటీ నివేదికను మండలికే సమర్పించాల్సి ఉంటుంది. 
సెలక్ట్ కమిటీ నివేదికపై మండలిలో చర్చిస్తారు. మండలిలో చర్చ తర్వాత అవసరమైన మేరకు సవరణలు చేయవచ్చు. సవరణలతో కూడిన బిల్లును తిరిగి శాసనసభకు పంపిస్తారు. మండలి నుంచి తిరిగి వచ్చిన బిల్లులోని సవరణలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోపోవచ్చు.  ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని కోరింది. సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణల్లో ప్రతిపాదించింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు సాధ్యం కాదని వాదించింది. సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ శాసన మండలికి పంపాల్సి ఉంటుంది. 

ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా బిల్లును తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 
అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మళ్లీ మండలికి పంపుతారు. మండలి ఆమోదించినా... ఆమోదించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా ఆమోదం కోసం గవర్నర్ కోసం పంపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: