మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అటు గులాబీ  అధినేత కెసిఆర్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానం ఓడిపోయిన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మున్సిపల్  ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు కూడా. ఇక ఎట్టకేలకు ప్రచారమంతా పూర్తి చేసుకొని నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటినుంచి ఎన్నికలు ఏవైనా... ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేస్తూ అని ఎన్నికల్లో ఘన  విజయాన్ని సాధిస్తూ వచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఇక ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఓటర్ల అందరూ టిఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

 

 

 కారణం పార్టీకి ఎదురు నిలిచే సరైన ప్రతిపక్షం అనేది బరిలో నిలవకపోవడం.. ఇక అక్కడక్కడ బరిలో నిలిచిన విపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు... నామమాత్రంగానే ఓటర్లను ఆకట్టుకోవడం... ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి  ప్రజల్లో మంచి పేరు ఉండటంతో... మున్సిపల్ ఎన్నికలు కూడా టిఆర్ఎస్ పార్టీకే కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. కాగా  రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిన్న జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందుగా ఎన్నికల ప్రచారంలో తమదైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సర్వ ప్రయత్నాలు చేశారూ . 

 

 

 

 కాగా నిన్న జరిగిన పోలింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నిన్న  జరిగిన ఓటింగ్ శాతం ప్రకారం... వివిధ సర్వేల లెక్కల ప్రకారం చూస్తే... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో ఓటర్ల అందరూ టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు సర్వేల్లో వెల్లడైంది. దీంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ ఫుల్ జోష్ లో మునిగిపోయారు. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తే ఏంటి ఎలాగో  మా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా తో ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు టిఆర్ఎస్ శ్రేణులు. అన్ని సర్వేల్లో మూడు వంతులకు పైగా.. ఇంకా చెప్పాలంటే 80 నుంచి 90 శాతం ఫలితాలు టిఆర్ఎస్ కే  అనుకూలంగా ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారట. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా... కారు స్పీడ్ ని ఎవరూ ఆపలేక పోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: