’తప్పు చేశాను.. అయినా విచక్షణ ఉపయోగిస్తున్నాను’...

పై వ్యాఖ్యలు చాలు ఛైర్మన్ పై ఏ స్ధాయి ఒత్తిడి వచ్చిందో అర్ధమవటానికి

 

శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యవహార శైలిపై అన్నీ వైపుల నుండి విపరీతమైన విమర్శలు మొదలైపోయాయి. మండలి చరిత్రలోనే లేనంతగా షరీష్ గబ్బు పట్టిపోయారు.  తాను తప్పు చేస్తున్నాను అని చెబుతునే విచక్షణ ఉపయోగించి అంటూ రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించటంలోనే ఛైర్మన్ ఎంతగా ఒత్తిడికి గురయ్యారో అందిరికీ అర్ధమైపోయింది.

 

అసలు ఛైర్మన్ అంతగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే చంద్రబాబునాయుడు వల్లే అని సమాధానం వినిపిస్తోంది. శాసనమండలి సభ్యునిగా ఎంపికవ్వటానికి ముందు షరీఫ్ టిడిపిలో పనిచేసేవాడు.  దశాబ్దాలుగా పార్టీలో చంద్రబాబు మనిషిగా షరీఫ్ పై  ముద్రుంది. మొన్నటి ఎన్నికల్లో కేవలం ముస్లిం ఓట్లకోసమే షరీఫ్ ను చంద్రబాబు ఎంఎల్సీని చేసి తర్వాత ఛైర్మన్ గా చేశారు. సరే ఉపయోగం కనబడలేదనుకోండి అది వేరే సంగతి.

 

వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి  అసెంబ్లీలో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు అందరూ చూస్తున్నదే. దాంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబులో ఒకరకమైన శాడిజం డెవలప్ అయ్యింది.  ఎలాగూ మండలిలో టిడిపికే మెజారిటి ఉంది. దాంతో తన శాడిజాన్ని చంద్రబాబు చూపిస్తున్నారు. తన శాడిజంను తీర్చుకోవటానికి షరీఫ్ ను పావుగా ఉపయోగించుకుంటున్నారు. అందుకనే అసెంబ్లీ పాసైన కీలక బిల్లులు మండలిలో వీగిపోతున్నాయి.

 

ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు మండలిలో పాస్ కాకుండా షరీఫ్ పై చంద్రబాబు విపరీతమైన ఒత్తిడి తెస్తున్నట్లు వైసిపి ఆరోపిస్తోంది.  ఇందులో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ బిల్లులను వ్యతిరేకించాలంటూ షరీఫ్ పై చంద్రబాబు ముందుగానే హెచ్చరించారట. మామూలుగా ఛైర్మన్ గా ఏ పార్టీ నేతున్నా అధికారంలో ఉన్న పార్టీ మాటే చెల్లుబాటవుతుంది. అలాంటిది నియమ, నిబంధనలను కూడా షరీఫ్ పక్కనపెట్టేశారంటేనే చంద్రబాబు ఏ స్ధాయిలో ఒత్తిడి తెచ్చారో తెలిసిపోతోంది.

 

పైగా ఎప్పుడూ లేనట్లుగా చంద్రబాబు మండలి గ్యాలరీలోకి వచ్చి కూర్చుని షరీఫ్ ను ప్రభావితం చేయటంపై అందరూ మండిపోతున్నారు.  మండలి గ్యాలరీకి వచ్చి చంద్రబాబు కూర్చోగానే షరీఫ్ పై ఒత్తిడి మొదలైంది. దాంతో ఒత్తిడిని తట్టుకోలేక చివరకు విచక్షణ పేరుతో కంపు చేసి మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదే వేసేశారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: