టెన్త్ చదవాలంటే కనీసం 14ఏళ్లు ఉండాలి. కానీ కొందరు చిచ్చరపడిగులు తక్కువ వయస్సులోనూ పదో తరగతి చదువుతుంటారు. ఇలాంటి వారు పదో తరగతి ఫైనల్ పరీక్షలు రాయాలంటే అనుమతి తీసుకోవాలి. అలా ఈ ఏడాది హైదరాబాద్ లో వయసు తక్కువ కావడంతో 1100 మంది పర్మిషన్ తీసుకున్నారట.

 

ఏడు, ఎనిమిది తరగతులు చదవాల్సిన వయసులోనే వారు పదో తరగతి పరీక్షలకు సిద్ధ మవుతున్నారు. ఇందు కోసం విద్యాశాఖ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. మార్చిలో ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలను ప్రత్యేక అనుమతితో రాయబోతున్నవారు 1100 మంది వరకు ఉన్నారు.

 

వచ్చే మార్చి పరీక్షలు రాయాలంటే 2019 - ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు 12 సంవత్సరాల వయసు వారూ అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఇలాంటి వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివుతుంటే.. ఏడాదిన్నర వయసు తక్కువ ఉంటే ఆ స్కూల్ హెచ్ఎం పర్మిషన్ సరిపోతుంది.

 

రెండేళ్ల వయస్సు తక్కువైతే.. ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్ సీ బోర్డు) డైరెక్టర్ పర్మిషన్ కావాలి. ఇక ప్రైవేట్ బడుల్లోని విద్యార్థులైతే ఏడాదిన్నర వరకు డీఈఓ, రెండేళ్ల వరకు ఎస్ఎస్ సీ బోర్డు డైరెక్టర్ అనుమతి తీసుకోవాలి. అంతకు మించితే విద్యాశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. ఇలా ప్రత్యేక అనుమతి పొందిన వారు 1100 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం గుర్తించింది. వారిలో 90% ప్రైవేట్ బడుల్లో చదివే వారే.

మరింత సమాచారం తెలుసుకోండి: