తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. అప్పట్లో కాంగ్రెస్ విధానాలకు ప్రజలంతా విసిగిపోయారని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయంగా బలహీనమైన క్రమంలో తెలుగుదేశం పార్టీని అక్రమ మార్గంలో లాక్కున్న చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ఆ పార్టీని క్రమక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇక అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఫోటో గాని, ప్రస్తావన లేకుండా చాలా కాలం పార్టీని నడిపించారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ ను కీర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఫోటోలను ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నం చేశారు.


 ముందు నుంచి నందమూరి కుటుంబాన్ని దూరంగా పెట్టిన చంద్రబాబు రాజకీయంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆ కుటుంబాలను చేరదీశారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ టిడిపి కాస్తా చంద్రబాబు టిడిపి గా మారిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది. ఇప్పుడున్నది అసలైన తెలుగుదేశం పార్టీ కాదని, నకిలీ తెలుగుదేశం అని చాలా మంది పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతూ ఉంటారు. తన రాజకీయాల కోసం, తన స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తూ వచ్చిన చంద్రబాబు ఆగడాలు 2014 తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి మరింతగా ముదిరిపోయాయి.


 పార్టీ నాయకుల మీద పట్టు కోల్పోయిన చంద్రబాబు వారు చేసే అవినీతి, అక్రమాలకు అడ్డు చెప్పడం మానేసి మరింతగా వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక తప్పిదాలకు పాల్పడుతూ వచ్చింది. 30 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు స్వార్ధ రాజకీయాల కారణంగా మాయని మచ్చల్ని తనమీద వేసుకుని ప్రజాధారణ కోల్పోయింది. తాను అధికారంలో ఉండగా ప్రజా సంక్షేమ పథకాల గురించి పట్టించుకోకుండా... కేవలం తమ పార్టీ నాయకులు, కొద్దిమంది తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు బాగోగులే ముఖ్యం అన్నట్టుగా బాబు పరిపాలన సాగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా అవినీతి వ్యవహారాలు పీకల్లోతు మునిగి పోయాడు చంద్రబాబు.


 ఇక రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాదులో ఉమ్మడి రాజధానిగా ఉండే హక్కు, అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో అకస్మాత్తుగా కరకట్ట కు మకాం మార్చారు. అక్కడ నుంచి రాజధాని ఏర్పాటు కోసం అనేక ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగానే రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుని తన అనుచరులతో, తన బినామీలుగా ఉన్న కొంతమంది నాయకులుకు ఈ విషయాన్ని లీక్ చేసి వారితో భారీగా భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. పోనీ అక్కడ ఏమైనా రాజధాని నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టారా అంటే అది లేదు. ఐదేళ్ల పరిపాలన మొత్తం ప్రచారాలేకే పరిమితం అయిపోయారు. గ్రాఫిక్స్ లో రాజధానిని చూపిస్తూ, తన అనుకూల మీడియా లో హడావుడి చేశాడు.


 తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు విసుగెత్తిపోయిన జనం 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ని చిత్తుచిత్తుగా ఓడించారు. అది ఎలాంటి ఓటమి అంటే... తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇంత ఘోరమైన ఫలితాలు ఎప్పుడూ ఆ పార్టీకి రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ ఇలా ప్రజలకు మేలు చేసే ప్రతి పనిని ముందుగానే అధ్యాయం చేయించి వాటిని అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినా ... అక్కడ  పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టడం భారీ బడ్జెట్ తో పాటు ఆ ప్రాంతం నిర్మాణాలకు సురక్షితం కాదు అని నిపుణుల రిపోర్టులు కూడా ఉండడంతో జగన్ ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోనూ  రాజధానిని ఏర్పాటు చేయాలని భావించి మూడు ప్రాంతాలు రాజధాని ప్రకటించారు.


 ఇక మూడు రాజధానులను జగన్ బాగా అభివృద్ధి చేస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన తెలుగుదేశం పార్టీ అమరావతి నుంచి రాజధాని తరలించడానికి వీల్లేదంటూ పోరాటానికి దిగింది. ప్రభుత్వం అమరావతి నుంచి రాజధాని తరలించడం లేదని చెబుతున్నా పట్టించుకోకుండా అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ.. రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించింది. ఈ వ్యవహారం కారణంగా తెలుగుదేశం పార్టీపై రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ఇవేవీ పట్టించుకోని తెలుగుదేశం పార్టీ కేవలం అమరావతి ప్రాంతంలో తమ నాయకులు పేర్లతో భూములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోరాటానికి దిగి ప్రజలను కూడా రెచ్చగొడుతోంది.


ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు జగన్ ప్రతిపాదనకు మద్దతు పలకడమే కాకుండా ఇది తమ అభివృద్ధికి.. తమ హక్కులను కాపాడుకునే ఒక ఉద్యమంగా భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేవలం అమరావతి ప్రాంతంలో ఐదు గ్రామాల పార్టీగా మారిపోయింది. కేవలం అక్కడ కొన్ని గ్రామాల ప్రజలు కోసమే తెలుగుదేశం పార్టీ ఇంతగా పోరాడుతోంది అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోవడంతో టిడిపి పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుపై అసెంబ్లీ లో బిల్లు పాస్ అయినా శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ ఉన్న కారణంగా ఆ బిల్లుని శాసనమండలి నియమాలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించేలా చంద్రబాబు చేసిన రాజకీయంపై రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లోనూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముందు ముందు తెలుగుదేశం పార్టీ పతనానికి చంద్రబాబు ఈ విధంగా గోతులు తవ్వుతున్నాడా అనే అనుమానాలు జనాల్లో వ్యక్తం అవుతున్నాయి. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: