నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి 1 వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్నారు.  నలుగురిని అదే రోజున ఉరి తీస్తున్నారు.  దీనికి సంబంధించిన ఏర్పాట్లు తీహార్ జైల్లో చురుగ్గా సాగుతున్నాయి.  ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ఉరికి సంబంధించిన కేసుల్లో అన్ని చిక్కు సమస్యలు పూర్తికావడంతో ఉరి తీయడానికి అన్ని రెడీ అయ్యాయి.  మిగిలింది ఉరి తీయడమే.  యూపీ నుంచి ఉరితాళ్లు కూడా ఎప్పుడో వచ్చేసాయి.  


అలానే ఉరికి సంబందించిన ట్రయల్స్ ను కూడా రన్ చేశారు.  ఇప్పుడు మిగిలిందల్లా ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయడమే.  ఉరి తీసే ముందు ఖైదీల చివరి కోరిక ఏంటో తెలుసుకొని దానిని తీర్చడం జైలు అధికారుల బాధ్యత.  వారి చివరి కోరిక ఏంటో చెప్పాలని అధికారులు కోరారు. కానీ, నలుగురు నిందితులు ఎలాంటి సమాధానం చెప్పలేదు.  పలు మార్లు ప్రశ్నించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదట.  చనిపోతున్నామనే భయం వారిలో కలిగింది. 


ఆ భయాందోళనల మధ్య నిందితులు కాలం గడుపుతున్నారు.  మరో వారం రోజుల్లో ఉరి వారి మెడకు బిగుస్తుంది. చివరి కోరికగా బంధువులను చూడాలని అనుకోవడమో లేదంటే, వారికి సంబంధించిన ఆస్తులను ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కుటుంబ సభ్యులకు చెప్పమని చెప్పడమో చేస్తుంటారు.  ఇవేమి చేయకుండా కామ్ గా ఉన్నారు అంటే అర్ధం ఏంటి... చావు భయం వారిని వెంటాడుతోందనే కదా.  లేదంటే ఉరి మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా?


నలుగురు దోషులను ఉరి తీయడానికి కావాల్సిన అన్ని అంశాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.  ఇక మిగిలింది ఉరి తీయడమే. నలుగురు దోషులకు ఉరి పడినపుడే తన కూతురుకి ఆత్మశాంతి కలిగినట్టు అవుతుందని నిర్భయ తల్లి ఇప్పటికే చెప్పింది.  అలానే దేశం మొత్తం కూడా ఫిబ్రవరి 1 వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఫిబ్రవరి 1 వ తేదీన అందరు నిద్ర లేచేసరికి నలుగురు దోషులు తీహార్ జైల్లో శాశ్వతంగా కన్నుమూస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: