చంద్రబాబునాయుడు అమరావతిని ఓ గేటెడ్ కమ్యూనిటిగా మార్చేద్దామని అనుకున్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగతున్న వ్యవహారాలు  చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.  మామూలు అపార్టమెంట్లలోకి ఎవరైనా వెళ్ళగలరు. కానీ గేటెడ్ కమ్యూనిటిలో ఉన్న అపార్ట్ మెంట్లలోకి వెళ్ళాలంటే చాలా తతంగాలుంటాయి.  లోపలకి వెళ్ళటం అంత సులభంకాదు. చంద్రబాబు ప్లాన్ చేసిన అమరావతి నిర్మాణం పూర్తయ్యుంటే ఓ సామాజికవర్గానికి లేదంటే కొందరు ప్రముఖులకు చెందిన గేటెడ్ కమ్యూనిటిగానే తయారయ్యుండేదనటంలో సందేహం లేదు.

 

ఎన్నికలకు ముందే ఎన్ఆర్ఐలతో పాటు తన సామాజికవర్గంలోని ప్రముఖులతో  చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారట. 2014లో అధికారంలోకి వస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని. అనుకున్నట్లే అధికారంలోకి రావటంతో  అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు. నిర్మాణాలు ఎందుకు ఆలస్యమయ్యిందంటే 2050 వరకూ తామే అధికారంలో ఉంటాము కాబట్టి నింపాదిగా చేసుకోవచ్చని చంద్రబాబు అనుకున్నారు.

 

రాజధాని నిర్మాణం పేరుతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేసిన కంపు అంతా చూసిందే. మొన్నటి ఎన్నకల్లో చంద్రబాబు కానీ కమ్మోరు కానీ ఊహించని విధంగా జనాలు టిడిపి మాడు పగులగొట్టారు. జగన్మోహన్ రెడ్డి  అఖండ మెజారిటితో అధికారంలోకి రాగానే  చంద్రబాబు కలలుకన్న భ్రమరావతికి  అనే  గేటెడ్ కమ్యూనిటి ప్రయత్నాలకు  దెబ్బపడింది.

 

జగన్ ఏమో అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని భావిస్తుంటే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు మొత్తం అమరావతిలోనే కంటిన్యు అవ్వాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నారు. ఎందుకంటే తన గెేటెడ్ కమ్యూనిటి కాన్సెప్ట్ దెబ్బతింటోందన్న బాధతోనే. 

 

అభివృద్ది మొత్తం హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వటం వల్ల రాష్ట్ర విభజన వల్ల ఏపికి జరిగిన నష్టమేంటో అందరికీ అనుభవమైంది. దాన్నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన చంద్రబాబు ఇంకా పరిపాలన, అభివృద్ధి కేంద్రీకరణకే మొగ్గు చూపటమే విచిత్రంగా ఉంది.  పైగా అమరావతిలోనే నవనగరాల పేరుతో పెద్ద డ్రామాకు తెరలేపారు. నిజంగానే చంద్రబాబు గనుక మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అలజడి రేగేదనటంలో సందేహమే లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: