వైకాపా పార్టీకి చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకుంది.  చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  అక్కడి నుంచి పోటీ చేసిన కోనేటి ఆదిమూలం విజయం సాధించారు.  ఆదిమూలం జగన్ కు బాగా సన్నిహితుడు.  పార్టీలో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి.  అలాంటి ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది.  కోనేటి ఆదిమూలం తల్లి కాంతమ్మ 86 సంవత్సరాల వయసులో తన సొంత గ్రామమైన భీముని చెరువులో కన్నుమూశారు.

 
దీంతో కోనేటి ఆదిమూలం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  తల్లి ఇచ్చిన ప్రోద్బలంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్టుగా చెప్తున్నారు.  ఆదిమూలం తన తల్లి నుంచే అన్ని నేర్చుకున్నారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తల్లికి చెప్తూ తల్లి నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉండేవారట. అయితే, ఆదిమూలం తల్లి హఠాత్తుగా పెద్దవయసు కారణంగా మరణించారు.  


దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరని అంటున్నారు. తన ఎదుగుదల కోసం తల్లి ఎంతగానో కష్టపడినట్టు అయన చెప్తున్నారు.  ఆదిమూలం తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  అలానే మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  
ఇక ఇదిలా ఉంటె, ఈరోజు వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లు విషయంపై తీసుకోల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నారు.

 శాసనమండలిలో చుక్కెదురుకావడంతో, ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మరి ఆర్దినెన్స్ ద్వారా ఈ బిల్లుకు చట్టబద్దత తీసుకురావొచ్చా... లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.  ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే, న్యాయస్థానాల ద్వారా ఏవైనా అడ్డంకులు ఉంటాయా అన్నది కూడా చూడాలి. నిన్నటి రోజున శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: