ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు , నారాయణలతో పాటు నర్సింహారావు అనే వ్యక్తిపై వెంకటాయపాలెం  కు చెందిన బుజ్జమ్మ అనే మహిళా ఫిర్యాదు మేరకు సిఐ డి కేసులు నమోదు చేసింది . వెంకటాయపాలెం  లోని తనకు చెందిన 97 సెంట్ల అసైన్డ్ భూమిని మాజీ  మంత్రులు లాక్కున్నారని ఆమె ఆరోపించింది . వెంకటాయపాలెం  కు చెందిన బుజ్జమ్మకు చెందిన అసైన్డ్ భూమి ని ఒక వ్యక్తి కొనుగోలు చేశారని సిఐడికి ఫిర్యాదు చేసింది . దీనితో  మాజీ మంత్రులపై , నర్సింహారావు అనే వ్యక్తిపై  ఎస్సి , ఎస్టీ అత్యాచారక నిరోధక చట్టం తోపాటు , పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు .

 

ఇదే విషయమై మాజీ మంత్రి పుల్లారావు స్పందిస్తూ తమపై అక్రమంగా కేసులు బనాయిస్తే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు . ప్రభుత్వం  తన ఇమేజ్ ను దెబ్బతీయాలన్న కుట్ర చేస్తోందని ఆరోపించారు . తమపై కేసులు పెడితే , రాజధాని తరలింపు ఉద్యమం ఆగదని చెప్పారు . అధికారులు , ప్రభుత్వం చెప్పినట్టుగా అడ్డగోలుగా  కేసులు నమోదు చేస్తూ , వెళ్తే వారు కూడా శిక్షార్హులవుతారని హెచ్చరించారు . అమరావతి ప్రాంతం లో టీడీపీ ప్రభుత్వ హయాం లో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ లో మాజీ మంత్రులు నారాయణ , పుల్లారావులు కీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే . అసైన్డ్ భూములను కూడా భూసేకరణ ప్రక్రియలో చేపట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది .

 

అసైన్డ్ చట్టం ప్రకారం లబ్ధిదారుడు , భూమిని సాగు చేసుకుని అనుభవించే హక్కు మాత్రమే ఉంది. ఒకవేళ భూమిని లబ్ధిదారుడు  విక్రయించే ప్రయత్నం చేస్తే అమ్మిన వారిపై , కొన్నవారిపై చట్టరీత్యా కేసులు తప్పవు . ఇక అసైన్డ్ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారన్న అభియోగం పై మాజీ మంత్రులపై సిఐడి కేసులు నమోదు చేయడం చూస్తుంటే ... మరికొంతమంది అసైనీలు ముందుకు వచ్చి సిఐడి కి ఫిర్యాదు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి .   

మరింత సమాచారం తెలుసుకోండి: