గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశంపార్టీ గైర్హాజరయ్యింది. శాసనమండలిలో బుధవారం జరిగిన గొడవలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి డిసైడ్ చేసినట్లు ఎల్లోమీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ బుధవారం నాడు మండలిలో చేసిన కంపు తర్వాత అసెంబ్లీలో గురువారం కనబడితే వైసిపి సభ్యులు ఎలా రియాక్టవుతారో అన్న భయంతోనే  పచ్చ బ్యాక్ బహిష్కరించినట్లు సమాచారం.

 

బుధావారం మండలిలో చర్చించాల్సిన రెండు బిల్లులు చర్చకు రాకుండా టిడిపి ఎంతగా గోల చేసిందో అందరికీ తెలిసిందే. మండలిలో తనకున్న మెజారిటిని ఉపయోగించుకున్నది టిడిపి. దానికి తోడు ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కూడా టిడిపి సభ్యుడే కావటంతో తెరవెనుక  పెద్ద డ్రామానే నడిపింది. బిల్లులపై మామూలుగా చర్చలు జరిపి ఓడగొట్టే మార్గమున్నప్పటికీ  సెలక్ట్ కమిటికి పంపేట్లుగా కుట్ర చేసింది.

 

సరే ఛైర్మన్ కూడా తమ సభ్యుడే కావటంతో  శాసనమండలి ప్రతిష్టను మంట కలిపేలా కుట్రను విజయవంతంగా అముల్లో పెట్టింది. మండలిలో ప్రతి విషయంలోను నియమ, నిబంధనలున్నప్పటికీ సంప్రదాయాలున్నప్పటికీ  వాటిన్నింటినీ కాదని ఛైర్మన్ తన విచక్షణ ఉపయోగించటమే విచిత్రంగా ఉంది. పోనీ విచక్షణ ఉపయోగించిన ఛైర్మన్ పద్దతిగా ఉపయోగించాడా అంటే అదీ లేదు. టిడిపి డిమాండ్లు నియమ, నిబంధనలకు విరుద్ధమని ప్రకటించిన ఛైర్మన్ మళ్ళీ టిడిపి డిమాండ్ చేసినట్లుగానే నడుచుకున్నాడు.

 

దాంతో మండలి సభ్యులతో ఛైర్మన్ షరీఫ్ కలిసి కుట్ర పన్నినట్లు అందరికీ అర్ధమైపోయింది. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే గురువారం అసెంబ్లీ సమావేశాలకు టిడిపి నుండి ఒక్కళ్ళు కూడా హాజరుకాలేదు. ఏమంటే బుధవారం మండలిలో జరిగిన సమావేశాల్లో అధికారపక్షం వైఖరికి నిరసనగా హాజరుకాకూడదని నిర్ణయించామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పోలీసును చూసిన తర్వాత దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది టిడిపి వ్యవహారం. మొత్తానికి మండలిలో తాము చేసిన కంపు విషయంలో అసెంబ్లీలో తమను అధికారపక్షం ఎక్కడ నిలదీస్తుందో అన్న భయంతోనే గైర్హాజరైనట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: