ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి, నవ్యంధ్ర గా ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో తొలిసారిగా అధికారరాన్ని చేపట్టిన టిడిపి ప్రభుత్వం, అప్పట్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడం జరిగింది. అయితే అప్పట్లో అమరావతిని రాజధానిగా ఎంపికచేయడం పై భిన్న స్వరాలు వినిపించిన మాట వాస్తవం. నిజానికి నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రాన్ని అందిన మేరకు దోచుకున్నారని విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసే సమయంలో ఆ ప్రాంతాల్లో వేల ఎకరాల భూమిని ముందే కొనుగోలు చేసిన టిడిపి అనునాయులు, ఒక్కసారిగా దానిని రాజధానిగా ప్రకటించిన తరువాత కోటీశ్వరులుగా పడగలెత్తారు. దానితో దాని చుట్టుప్రక్కల ప్రాంతాల భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. 

 

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన వైసిపి పార్టీ తరపున వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుండి రాష్ట్రాన్ని వీలైనంత అభివృద్ధి పధంలో ముందుకు తీసుకు తీసుకెళ్లాలా పలు పధకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం పై మొదటి నుండి కుట్ర చేస్తూనే ఉంది టిడిపి. ఇక ఇటీవల క్యాబినెట్ లో నిర్ణయించిన మేరకు ఆంధ్రకు మూడు పరిపాలన రాజధానులను ఎంపిక చేసారు జగన్. ఆ విధంగా మూడు రాజధానులు ఉంటే అటు రాయలసీమ, కోస్తాలతో పాటు ఇటు ఆంధ్ర ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలానే అన్ని ప్రాంతాల వారికి కూడా సమంగా అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతోనే ఈ మూడు రాజధానుల అంశాన్ని ప్రవేశపెట్టినట్లు జగన్ తెలిపారు. అయితే దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు, 

 

అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని, అక్కడి కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలకు దిగారు. అయితే మాట ఇచ్చాక మాడిమ త్రిప్పని జగన్ మాత్రం, మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ముందుకు నడవడానికి సిద్ధం అయ్యారు. బాబోరి తెదేపా 5 - 30 ఊళ్ళకు మాత్రమే పరిమితమై చేస్తున్న రాజధాని  గొడవను, తమ-తమ ఆస్ధులను కాపాడే ప్రయత్నంగా చూపించడంలో, 12 వేల పైచిలుకు గ్రామాల ప్రజలను బాబోరి తెదేపా గాలి కొదిలేసిందంటూ ప్రజలలో అవగాహన తేవడంలోనూ, తెదేపా ను ఆ 5 - 30 గ్రామాలకు మాత్రమే పరిమితం చేయడంలోనూ వైయస్సార్ సిపి పూర్తిగా సఫలీకృతమైందని చెప్పాలి. అయితే ఇటువంటి ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నపుడు మధ్యలో చిన్న చితక సమస్యలు రావడం సహజం అని, అయితే మెజారిటీ ప్రజల రక్షణే తన బాధ్యత అని అంటున్నారు జగన్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: