పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి  ఇమ్రాన్ ఖాన్ సినీ ఇండ‌స్ట్రీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి కూడా ఏదో విధంగా భార‌తీయుల పై బుర‌ద చిమ్ముతూనే ఉన్నారు.  తాజాగా ఆయ‌న పాక్ లో జ‌రిగే అరాచ‌కాల‌కు, అత్యాచారాల‌కు, వ్య‌స‌నాల‌కు ఆ దేశంలోని ప్ర‌జ‌లు బానిస‌ల‌వ్వ‌డానికి  ప్ర‌ధాన కార‌ణం సినిమా ఇండ‌స్ట్రీనే అన్నారు. టెక్నాల‌జీ పెరిగిపోయింది. పిల్ల‌లు, పెద్ద‌లు అన్న తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు మొబైల్ ఫోన్స్ వాడ‌కం బాగా ఎక్కువయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ్వ‌రికీ ఏ విష‌యం తెలియ‌దు అని అనుకోవ‌డం మ‌న అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. చిన్న పిల్ల‌లు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ మొబైల్ ఉంటుంది. 

 

అలాగే బ‌య‌ట చ‌దువుకునే చోట్ల కొంత మంది చెడు స్నేహాల వ‌ల్ల మాద‌క ద్ర‌వ్యాల‌నేవి అల‌వాటు ప‌డుతున్నారు. మొదట్లో ఈ విష‌యం పై పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ. ప్ర‌ధాని అయ్యాక అస‌లు స‌మ‌స్య ఎక్క‌డి నుంచి పుట్టుకొచ్చింది అన్న‌ది అర్ద‌మ‌యింది. అలాగే పాకిస్ఠాన్‌లో లైంగిక దాడులు కూడా ఎక్కువ‌య్యాయి. ఈ విష‌యం చాలా బాధ‌క‌లిగించే విష‌యం. ఇక ఎక్కువ శాతం ఫోన్ల‌లో మ‌న‌కు క‌నిపించే కంటెంట్  అంతా కూడా కేవ‌లం సినిమాల ద్వారానే వ‌స్తుంది అని ప్ర‌ధాని అంటున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్ నుంచి నేటి యువ‌త వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌కు అల‌వాటు ప‌డుతున్నారు. కేవ‌లం సినిమాల వ‌ల్లే కాపురాలు కూడా కూలిపోతున్నాయి అంటున్నారు. 

 

ఇక పాక్ ప్ర‌ధాని అయిన ఇమ్రాన్ మాట‌ల‌కు చాలా మంది ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఆయ‌న మాట్లాడే మాట‌ల‌కు అర్ధ ముందా అంటూ సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. ఇక ఈ సినిమాలు చూడ‌టం వ‌ల్ల‌నే అక్క‌డి జ‌నాలు పాడ‌వుతున్న‌ప్పుడు అసలు ఇక్క‌డి సినిమాల‌ను ఆద‌రించ‌డ‌మెందుకంటున్నారు. అలాగే బాలీవుడ్‌లో వ‌చ్చే సినిమాల‌కంటే కూడా పాక్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెర‌కెక్కే చిత్రాల్లోనే ఎక్కువ‌శాతం అశ్లీల‌త ఉందంటూ ఇక్క‌డి ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఏ దేశ ప్ర‌జ‌లైనా స‌రే హ‌ద్ద‌లు మీరి ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. అలాగే పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఓ కంట క‌నిపెట్టుకుంటూ ఉండాలి. దానిల్ల ఇలాంటి అన‌ర్దాలు జ‌ర‌గ‌వు. పిల్ల‌ల‌ను విచ్చ‌ల‌విడిగా వదిలేస్తే ప్ర‌స్తుతం ఉన్న ఫాస్ట్ జ‌న‌రేష‌న్‌కి ఇలాంటి అర్ధాలే చోటు చేసుకుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: