40 ఏళ్ల రాజకీయ అనుభవం చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముప్పు తిప్పలు పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కోల్పోవడం వల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దెబ్బతిందని అదే హైదరాబాదు ఉండటంవల్ల ధనిక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పేరు అందిందని దానికి కారణం అభివృద్ధి అంతా హైదరాబాదులోని జరగటం వల్ల మాత్రమే అని., మళ్లీ అటువంటి పొరపాటు మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదని వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు అన్ని రకాల ప్రజలు భాగస్వామి కావాలని వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ బిల్లుకు ఆమోదం పొందేలా జగన్ వ్యవహరించిరు. కానీ చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఉండాలని శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో చాణిక్య రాజకీయం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు పచ్చ మీడియా ఛానల్ కి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు ని తెగ పొగుడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నారు.

 

విషయంలోకి వెళితే భవిష్యత్తులో కచ్చితంగా ఈ వికేంద్రీకరణ బిల్లు పాస్ అవడం గ్యారెంటీ అని ప్రస్తుతం అధికార పార్టీ వైసిపికి అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి. దీంతో శాసనమండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే చేరుతాయి. అందుకే- కొద్దిగా వేచి చూద్దామనే ధోరణిలో వైఎస్ జగన్ ఉన్నారని ఆ పార్టీకి చెందిన శ్రేణులు చెబుతున్నారు. ప‌లువురు ఎమ్మెల్సీలు విడ‌త‌ల వారీగా వైసీపీలోకి జంప్‌ అయ్యే అవకాశాలతో పాటు... కొంద‌రికి ప‌ద‌వీ కాలం అయిపోనుంది. వచ్చే అయిదేళ్ల కాలంలో దశలవారీగా తెలుగుదేశం పార్టీ దాదాపు అన్ని స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది శాసన మండలిలో. 2024 నాటికి మండలిలో టీడీపీకి ముగ్గురు మాత్రమే సభ్యులు మిగిలవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఎట్లా చూసినా ఈ మూడు నెలలు తప్ప భవిష్యత్తు అంతా వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.

 

అంతేకాకుండా రాజకీయంగా ఇది జగన్ కి చాలా మేలు జరిగినట్లు అని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 3 రాజధానుల బిల్లును ద్రవ్య బిల్లుగా పెట్టి , శాసన మండలి నిర్ణయంతో సంబంధం లేకుండా చట్టం చేసే అవకాశం ఉంది. కానీ జగన్ ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. కావాలనే జగన్ సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లినా గాని ప్రస్తుతం మౌనంగా ఉన్నారని ఈ దెబ్బతో చంద్రబాబు ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రజల ముందు దోషిగా తేలి పోయారని తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఆ రెండు ప్రాంతాలలో పట్టు కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: