నిబంధనలు పాటించక పోవడం అతివేగం వెరసి రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. మనం సరిగ్గా వెళ్లిన ఎదుటివారి సరిగ్గా రాకపోవడంతో రోడ్డు ప్రమాదం ఎక్కడనుండి  పొంచి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కాగా  ఈ ఒక్క రోజులోనే తెలంగాణలో వేరు వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం సమయం లో పలు  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దయ్యాల వాగు వద్ద... రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవరు ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

 

 ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం తండా వద్ద మరో రోడ్డు ప్రమాదం పూర్తి చేసుకుంది. రోజులాగే కూలీలు టాటా ఏస్ వాహనంలో కూలి పనుల నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న టాటా ఏస్ మరో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఘటన జరిగిన సమయంలో ఆటోలో 17 మంది ప్రయాణికులు ఉండగా... అందరికీ తీవ్రగాయాలయ్యాయి. ఇక గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులోని బైపాస్ వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కెట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై వెళ్తున్న ట్రాక్టర్ ను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు... 

 


 ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన కారు ప్రమాదంలో  టీవీ ఛానల్ రిపోర్టర్ దామోదర్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి పొగమంచే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దారి కనపడక పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: