2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబుకు షాక్ ఇస్తూ ఉంటే... మరోవైపు సొంత పార్టీ నేతలే పార్టీని వీడుతూ భారీ షాక్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే టిడిపి ఎంపీలు బీజేపీలో చేరడం.. టిడిపిలో కీలక నేతగా ఉండి చంద్రబాబుకు వెన్నెముకగా  ఉండే వల్లభనేని వంశీ పార్టీ వీడి ఏకంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం... ఆ తర్వాత టిడిపి యువత విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకోవడం... ఇలా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ల  మీద షాక్ లు  తగులుతూనే ఉన్నాయి. 

 

 దీంతో రోజు రోజుకు టిడిపి పార్టీ పరిస్థితి కూడా అధ్వానంగా తయారవుతుంది. ఇప్పటికే టీడీపీ చరిత్రలో లేనంతగా మొదటిసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఉన్న కొంతమంది లో కూడా పార్టీని కీలక నేతలు వీడుతుండటంతో  టీడీపీ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటీవలె తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వివరించిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసన మండలి సమావేశాలకు ముందే తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనని టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తేల్చిచెప్పారు. 

 


 అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీలో చేర్చుకోవాలని సీఎం జగన్  సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనతోనే భర్తీ చేయాలనీ  వైసీపీ భావిస్తోందట. దీంతోపాటు మరో కీలక నేత అయిన పోతుల సునీత కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పోతుల సునీత తో పాటు శివనాథ్ లను కూడా వైసిపి లో చేర్చుకోవడానికి.. జగన్ సిద్ధమయ్యారు అంటూ ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. వీరే కాకుండా మరో 11  మంది ఎమ్మెల్సీలు కూడా టిడిపికి గుడ్బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి వరుసగా పార్టీ నేతలు వెళ్లిపోతుంటే.. చివరికి టిడిపి పార్టీ పరిస్థితి,  అధినేత చంద్రబాబు పరిస్థితి ఏమవుతుందో అన్న ప్రశ్న ఆంధ్ర రాజకీయాల్లో మెదులుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: