అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ స్మార్ట్ ఫోన్ ను సౌదీ రాజు హ్యాక్ చేశారని గార్డియన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 2018లో జరిగిందని, ఆ సమయంలో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి, జెఫ్ సెల్ ఫోన్ కు ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చిందని, దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని ఆ పత్రిక తెలియజేసింది.

 

జెఫ్‌ మెజోస్‌ జీవితాన్ని ఆ వాట్సాప్‌ మెసేజ్‌ మలుపు తిప్పిందా? ఆ ఒక్క మెసేజ్‌ తోనే పాతికేళ్ల వివాహం విడాకులయిందా? అవునంటోంది గార్డియన్‌ పత్రిక. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్ హ్యాకింగ్‌ కు గురైంది. సౌదీ యువరాజు పంపిన ఎన్‌ క్రిప్టెడ్‌  వాట్సాప్ వీడియో ద్వారా బెజోస్ మొబైల్ హ్యాకింగ్‌ కు గురైనట్టు తెలుస్తోంది. 2018 మే 1న బెజోస్‌ కు సౌదీ యువరాజు వాట్సాప్ మెసేజ్ పంపారు. ఇందులోని కోడ్ ద్వారా బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌ కు గురైందని విచారణలో తేలిందని సమాచారం. సౌదీ యువరాజు వాట్సాప్ ఖాతాను ఉపయోగించి ఈ హ్యాకింగ్కు పాల్పడ్డారని.. ఇందులో ఆయన ప్రమేయం కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

 

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ - జెఫ్ బెజోస్లు ఇద్దరూ  ఆ రోజు డిన్నర్‌ కు కలిశారు. ఆ తర్వాత బెజోస్‌ కు మొహ్మద్ బిన్ సల్మాన్ ఓ వీడియో మెసేజ్‌  పంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేశారని గార్డియన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించడంపై కలకలం రేగింది. ఈ ఘటన ఇప్పటిది అయితే కాదు కానీ.. 2018లో జరిగిందని ఆ పత్రిక వెల్లడించింది. హ్యాక్ కావడం ఓ మెసేజ్ బయటపడమే తన జీవితంలో ఒడిదుడుకులకు కారణమైందని తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: