151 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండడంతో... జగన్ సర్కార్ నిర్మించతలపెట్టిన 3 రాజధానిల కి సంబంధించిన బిల్లు శాసనమండలిలో సులభంగానే ఆమోదముద్ర పొందింది . కానీ ఆ బిల్లు శాసన మండలి కి వచ్చేసరికి... ఆ బిల్లుకు టిడిపి తీవ్రస్థాయిలో అడ్డంకులు సృష్టిస్తోంది. మొదటి రోజు అసలు బిల్లుని శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఇవ్వకుండా అడ్డుకున్న టిడిపి ఇక రెండవ రోజు మంత్రులు మరింత ఒత్తిడి తేవడంతో శాసనమండలిలో వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. అయినప్పటికీ వైసీపీని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తోంది టిడిపి. శాసనమండలిలో టిడిపి పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉండడంతో... వైసిపి సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వికేంద్రీకరణ బిల్లు సహా సిఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లుపై శాసనమండలిలో అధికార విపక్ష పార్టీల నడుమ హోరాహోరీ చర్చ జరిగింది. 

 

 

 ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కాదు తోపులాట కూడా జరిగింది. ఇక ఇక శాసనమండలి చైర్మన్ వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ తీర్మానించారు. ఇదిలా ఉంటే... నాడు శాసన మండలిలో  నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వచ్చిన సమస్యే  ఇప్పుడు జగన్ కు  ఎదురైంది. నాటి అసెంబ్లీలో ఎన్టీఆర్ కు ఫుల్ మెజారిటీ ఉండగా... శాసనమండలిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉండేది. దీంతో  కాంగ్రెస్ ప్రతి విషయంలో ఎన్టీఆర్ ను  ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఎన్టీఆర్ తిక్కరేగి శాసనమండలిని రద్దు చేశారు ఎన్టీఆర్ . ఇప్పుడు జగన్ కి కూడా శాసనమండలిలో టిడిపి ఇబ్బందులకు గురి చేస్తుండటం తో శాసన మండలి రద్దు చేయాలని నిర్ణయించాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 అయితే ఆనాడు ఇబ్బంది పెట్టిన శాసనమండలిని రద్దు చేసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హీరో అయితే... ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేస్తే చంద్రబాబు జీరో అవుతాడు . ఎందుకంటే అసెంబ్లీలో తక్కువ బలంతో  అధికార పార్టీని ఏమి విమర్శించ లేని పరిస్థితి ఉంది.. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ చంద్రబాబుకు బలంగా మారింది. మరి జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేస్తే.. టీడీపీకి ఉన్న బలం కాస్త మొత్తం తగ్గిపోయి చంద్రబాబు పూర్తిగా జీరో అవ్వక తప్పదు. ఒకవేళ మళ్లీ ఎన్నికలైనా టీడీపీకి గెలిచే అవకాశాలు కూడా తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి: