శాసనమండలి విషయంలో వైకాపా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం అధికంగా ఉండటంతో మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నది.  మూడు రాజధానుల బిల్లును అడ్డుకోటంతో మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  దానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది.  మండలిని రద్దు చేసేందుకు అవసరమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది.  దీనికి సంబంధించిన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.  


ఈ ఉదయం నుంచి కూడా ప్రభుత్వం దీనిపై న్యాయనిపుణులతోను, మంత్రులతోను చర్చలు జరుపుతున్నది.  ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాల్సిన అంశం. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేవని తెలిస్తే, వెంటనే ప్రభుత్వం మండలిని రద్దు చెయ్యొచ్చు.  అలా కాకుండా ఏదైనా తేడా ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తే... ఏం చేయాలి అన్నది ఆలోచించాల్సిన అంశం.

 న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకొని అన్ని రకాల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్లాలని చూస్తున్నది.  
ఇక ఇదిలా ఉంటె, మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే దీని వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.  మూడు రాజధానుల అంశం ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తున్నది.  మూడు రాజధానులు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అవుతుందని అంటోంది ప్రభుత్వం.  మరి దీనిని ఎలా చూస్తుంది అన్నది తెలియాలి.  


ఇకపోతే, మూడు రాజధానులు ఉంటె రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదు అన్నది ప్రతిపక్షాల భావన.  మండలిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ అడ్డుకుని సెలెక్ట్ కమిటికి పంపింది. దీనితో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే మండలి రద్దు విషయంలో అనేక ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన ఉదయం నుంచి కూడా సీనియర్ నేతలతో సమావేశమై సాధ్యాసాధ్యాలను, అందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక మండలి రద్దు జరగాలి అంటే దాదాపు ఏడాది పాటు ప్రక్రియ ఉండే అవకాశం ఉంది.  కేంద్రం కూడా ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఉభయసభల్లో ఆమోదింపజేసుకోవాల్సి ఉంటుంది.  అది ఎప్పటికి అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: