చెప్పుకోవడానికి జాతీయ పార్టీగా బీజేపీ కనిపిస్తున్నా ఏపీలో మాత్రం ఆ పార్టీ నాయకులు తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఏదైనా ఒక సమస్య మీద కాని, అభిప్రాయం మీద కాని పార్టీ మొత్తం ఏకాభిప్రాయంతో ఉంటుంది. కానీ బిజెపి లో మాత్రం అటువంటి విధానాలు ఏవి కనిపించడంలేదు. కేంద్రంలో ఒక అభిప్రాయం ఉంటే ఏపీ నాయకుల్లో ఇంకో అభిప్రాయం బయటకు చెబుతూ అసలు బిజెపి స్టాండ్ ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇదే పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీలోనూ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ వ్యవహారాలు నడిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏదో ఒక స్టాండ్ తో పార్టీ లేకపోవడం, నాయకుల్లో చిత్తశుద్ధి లేక గందరగోళ ప్రకటనలు చేస్తూ ఆ పార్టీ పుట్టి ముంచారు.


 అప్పటి నుంచి ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నా అది ఇప్పుడు అప్పుడే సాధ్యమయ్యే పని కాదు అన్నట్టుగా మారింది. ఇక అదే రూట్లో ఇప్పుడు బీజేపీ కూడా ముందుకు వెళ్తోంది. చంద్రబాబు హయాంలో ఏపీకి కేంద్రం నుంచి అనుకున్నంత స్థాయిలో సహాయ సహకారాలు అందకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపించడం, బిజెపికి ఏపీలో పట్టు సాధించాలకేపోవడానికి  కారణం అయింది. ఇప్పుడు కూడా బిజెపి అదే రకమైన పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలో బిజెపి అగ్రనాయకులు అంతా ఏపీ రాజధాని వ్యవహారం తమ పరిధిలోని కాదంటూ చెబుతున్నారు. 


అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది  అంటూ ప్రకటనలు చేస్తుంటే, ఏపీ బిజెపి నాయకులు మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని, ప్రతిపక్ష తెలుగుదేశం, కొత్త మిత్రుడు పవన్ తో కలిసి పోరాడేందుకు సిద్ధమవుతోంది. దీంతో అసలు మూడు రాజధానుల విషయంలో బిజెపి స్టాండ్ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా పోయింది. ఇదే రకమైన కన్ఫ్యూజన్ లో పార్టీని ముందుకు తీసుకువెళ్తే ఏపీలో బీజేపీ ఎదుగుదల కాదు కదా ఆ పార్టీని ఇప్పటివరకు అభిమానిస్తున్న వారు కూడా దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: