ఎమ్మెల్యేలుగా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాల్సిన ప్రజాప్రతినిధుల కొడుకులు ఇష్టానుసారంగా సమాజంలో తండ్రికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ కొడుకు విష్ణువర్ధన్ కిరాణా షాపుల దగ్గర వ్యవహరించిన తీరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో అదేవిధంగా తెలంగాణ మీడియా లో వైరల్ గా మారింది. పీకలదాకా తాగి కిరాణా షాపుల దగ్గర కిరాయి రౌడి గా వ్యవహరిస్తూ చిరు వ్యాపారుల దగ్గర మాముళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెచ్చిపోయారు. దీంతో అదే సందర్భంలో ఆ ప్రాంతంలో కొంతమంది ఈ విషయాన్ని చూసి వీడియో తీసి ఎమ్మెల్యే కొడుకు వ్యవహరించిన తీరును మొత్తం రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని ఆ చిరు వ్యాపారాలు అడుగుతున్న ఎమ్మెల్యే కొడుకు మాత్రం చాలా దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో చిత్రీకరణ లో తేలింది. మెదక్ లో చిరు వ్యాపారులు రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు.

 

ఎప్పుడు భయాందోళనలతో పోలీసులు తమ బడ్డీకొట్టు లను పీకి పక్కన పెడతారేమో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అడపాదడపా పోలీసులు మరియు మున్సిపాలిటీ కార్మికులకు డబ్బులు కట్టే చిరు వ్యాపారులు ఒక్కసారిగా ఆ ప్రాంతంలోకి ఎమ్మెల్యే కొడుకు వచ్చి ఫుల్ గా తాగి వచ్చి తమ దగ్గర డబ్బులు అడగటం తో అతను ఎవరో తెలియక అసలు డబ్బులు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక మాముళ్లు ఇవ్వమని అడగడంతో నోరెళ్లబెట్టారు. ఏంటీ మాముళ్లా.. ఎప్పుడూ ఇవ్వలేదే అని ప్రశ్నించారు.

 

కానీ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ కుమారుడు విష్ణువర్ధన్ ఫుల్ గా తాగి ఉండటంతో తన కోపాన్నంతా ప్రదర్శించాడు. ఆ ప్రాంతంలో ఉన్న చిరువ్యాపారులు అందరూ తనకు మాముళ్లు కట్టాల్సిందే అన్నట్టుగా వ్యవహరించి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. తమకు ఉపాధినిస్తోన్న షాపులపై దాడి చేస్తోన్న చూస్తూ ఊరుకున్నారే గానీ ఆ చిరు వ్యాపారులు.. ఏమీ అనలేని కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. దాడి చేయొద్దు అని అంటే మరింత రెచ్చిపోతాడని భయపడిపోయారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో సదరు ఎమ్మెల్యేపై నెటిజన్లు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: