ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో ప్రజా ప్రతినిధులు చేత ఆమోదం పొందిన బిల్లును శాసనమండలిలో తండ్రిలాగా సభకు హుందాగా వ్యవహరించాల్సిన చైర్మన్ వికేంద్రీకరణ బిల్లు అంశంలో వ్యవహరించిన తీరు సభలో వాతావరణం పనికిమాలిన సభను తలపించింది అన్నట్లుగా చైర్మన్ పై రెచ్చిపోయారు అంబటి రాంబాబు. శాసన మండలి అభివృద్ధి నిరోధకంగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని వికేంద్రీకరణ బిల్లు అంశంలో ఆయన వ్యవహరించిన తీరుపట్ల మేధావులంతా తప్పు పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని అసలు శాసనమండలిలో నిన్న సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లులను పంపాల్సిన అవసరం లేదని ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరిగిందని న్యాయబద్ధంగా చైర్మన్ వ్యవహరించాలని ముందు నుండి అదే కోరామని అంబటి రాంబాబు తెలిపారు.

 

శాసనమండలిలో జరిగిన పరిణామాలు చూసిన చాలా మంది సీనియర్ నాయకులు ఆందోళన చెందారు అని దేశంలో ఏ రాష్ట్రంలో మండలి లేదని మన రాష్ట్రంలోనే ఉందని వాటి సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి రెండు సభలు సహకరించాలని అదేవిధంగా ఏదైనా పొరపాటు ఉంటే సవరణలు చేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ బిల్లులను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపొచ్చని.. అలా కాకుండా బిల్లును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారిందని.. ఇటువంటి సమయంలో శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

 

శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించిన తీరు మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని సభలో దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారు దేశంలోనే సీనియర్ రాజకీయ నేతలు అని చెప్పుకునే చంద్రబాబు చాలా నీచంగా శాసనమండలిలో వ్యవహరించారని అంబటి విమర్శించారు. అంతేకాకుండా శాసనమండలి చైర్మన్ ఎదురుగా గ్యాలరీ లో కూర్చుని చంద్రబాబు తన కనుసైగలతో చైర్మన్ పై ఒత్తిడి తెచ్చారని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాలని సభలో పెద్దలుగా వ్యవహరించాల్సిన వాళ్ళు పిల్లలుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాకపోయినా తొందర్లోనే బిల్లు పాస్ అవడం గ్యారెంటీ అని ఈ విషయంలో ఎవరూ ఆపలేరని అంబటి పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: