రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుల్ని అసెంబ్లీలో మందబలంతో ఆమోదించిన  అధికారపార్టీ మండలిసాక్షిగా ఛైర్మన్‌పై  దూషణలకు దిగుతూ, దాడికి ప్రయత్నించిందని  టీడీపీసీనియర్‌నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వాపోయారు.మండలిలో రూల్‌-71పై చర్చ జరుగుతుండగానే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి లాబీల్లో కూర్చొని సైగలుచేస్తూ కనిపించాడన్నారు. మండలి సభ్యుల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన విజయసాయి, పవిత్రమైన పెద్దలసభను కొనుగోలు కేంద్రంగా మార్చాడని బచ్చుల మండిపడ్డారు. అధికారపార్టీసభ్యులు, మంత్రులతో కలిసి, ఛైర్మన్‌ షరీఫ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ, లేనిదాన్ని తమకు అనుకూలంగా చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటం విజయసాయికే చెల్లిందన్నారు. 

 

ఛైర్మన్‌ బాత్రూమ్‌కు వెళ్లినా వదలకుండా, షరీఫ్‌ రెండుచేతులు పట్టుకొని ఆయన్ని ప్రలోభాలకు గురిచేశాడన్నారు. మంత్రులుకూడా వీధిరౌడీలను మరిపించేలా, ఛైర్మన్‌ చేతిలోని కాగితాల్ని చించిపారేసి, ఆయనముందున్న బల్లపైకెక్కి విధ్వంసం సృష్టించారని అర్జునుడు తెలిపారు. నిబంధనలపేరుతో, తప్పుడు బిల్లుల్ని ఆమోదించుకోవడానికి దుష్టఆలోచనలతో మంత్రులు చేయాల్సిన దాష్టీకాలన్నీ చేశారన్నారు. బెయిల్‌పై తిరుగుతున్న విజయసాయిరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ లోకి వెళ్లి, ఆయన్ని బెదిరించాడన్నారు. బిల్లులో ఉన్న తప్పులన్నింటినీ ఛైర్మన్‌హోదాలో షరీఫ్‌ కూలంకషంగా విశదీకరించినా కూడా మంత్రులు వెనక్కుతగ్గలేదన్నారు. 

 

వైసీపీ సభ్యులంతా నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, విజయసాయిరెడ్డి చర్యలను సమర్థించరని  బచ్చుల తేల్చిచెప్పారు. జేబులుకొట్టేవాళ్లు, బ్లాక్‌టిక్కెట్లు అమ్మేవాళ్లు, దాదాగిరీ చేసేవా ళ్లు రాష్ట్రానికి మంత్రులయ్యారని, వారు మాట్లాడేభాష, హావభావాలు నీచాతినీచంగా ఉన్నాయన్నారు. నిన్న ఇద్దరిని కొన్నాం.. ఈరోజు మరో ఇద్దరిని కొంటున్నాం..మీరేమి చేయలేరంటూ మండలిసాక్షిగా ప్రతిపక్షసభ్యులను బెదిరించిన విజయసాయి బెయిల్‌ని తక్షణమే రద్దుచేయాలని అర్జునుడు డిమాండ్‌చేశారు. 

 

విశాఖలో పొలాలుకొన్నంత తేలిగ్గా, మండలిలో ప్రతిపక్షపార్టీ సభ్యుల్ని కొనాలన్న తాపత్రయం ఏ2లో అడుగడుగునా కనిపించిందన్నారు. అధికారపార్టీ ఎంతగా భయపెట్టి నా, మంత్రులు ఎన్నిరకాలుగా దూషించినా, ఎక్కడా భయపడకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నిలిచిన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడుకాదని, తమపార్టీ, తమనాయకుడు నేర్పిన సభ్యత, సంస్కారం వల్లనే తామె వరమూ హద్దులు మీరడంలేదన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: