శాసనమండలికి ఆయుష్షు తీరిపోయినట్లే అనిపిస్తోంది. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో శాసనమండలి అవసరమా ? అనే విషయమై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ను కోరారు. దాంతో  మండలి రద్దు లేకపోతే కొనసాగించే విషయంలో సోమవారం అసెంబ్లీలో ప్రత్యేకించి చర్చ జరిని నిర్ణయం తీసుకుందామనన్న జగన్ సూచనకు స్పీకర్ కూడా అంగీకరించారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని డిసైడ్ అయ్యింది.

 

మొత్తానికి ఇక ఎన్నో రోజులు మండలి ఉండదని అర్ధమైపోయింది. నిజానికి రెండు రోజుల క్రితమే శాసనమండలిని రద్దు   చేసేయాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఫైలును కూడా రెడీ చేశారు. అయితే తెర వెనుక ఏమి జరిగిందో ఏమో కానీ మండలి రద్దు నిర్ణయాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకున్నారు. అయితే రెండు బిల్లుల విషయంలో మంగళవారం ఉదయం నుండి బుధవారం రాత్రి వరకూ మండలిలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

 

నియమ,  నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా తన విచక్షణను ఉపయోగించి రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ విచక్షణను ఉపయోగించటమే ఇక్కడ విచిత్రంగా ఉంది.  అసలు ఓటింగ్ జరిగే విషయంలో టిడిపి పదే పదే అడ్డుపడుతున్న విషయాన్ని పక్కన పెట్టేసి, తన పరిధిలో లేని అంశంపై విచక్షణాధికారాలంటూ ఛైర్మన్ షరీఫ్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపి సభ్యులతో ఛైర్మన్ కలిసిపోయారు. షరీఫ్ కూడా టిడిపి ఎంఎల్సీనే కాబట్టి నియమాలను గాలికొదిలేశారు. సరే తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. ఇదే విషయమై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా మాట్లాడుతూ అసలు మండలి అవసరమే లేదని అభిప్రాయపడ్డారు.  చివరకు ఇదే విషయమై నిర్ణయించటానికి సోమవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరచాలని డిసైడ్ అయ్యారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: