చంద్రబాబు.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మామ పార్టీ లాక్కున్న చంద్రబాబు.. మొదట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాడు.. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగాకా కేవలం ఆంధ్రకు మాత్రమే సీఎం అయ్యాడు... ఇప్పుడు ఓడిపోయినా చంద్రబాబు కేవలం అమరావతికి మాత్రమే ప్రెసిడెంట్ అయ్యాడు. 

 

అసలు ఏంటి అనుకుంటున్నారా? అవును.. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయాడు అని అంటున్నారు నెటిజన్లు.. అతనికి మతి లేదు.. 70 ఏళ్ళు వయసు వచ్చింది.. వృద్ధాప్యం వచ్చింది.. అందుకే ఈ చంద్రబాబు ఇలా అని అంటున్నారు ప్రజలు. ఇంకా అసలు విషయానికి వస్తే.. చంద్రబాబు 2019 ఎన్నికల్లో 40 ఏళ్ళ కుర్రాడి చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. 

 

ఇంకా అప్పటి నుండి.. ఆ అవమానం తట్టుకోలేక ప్రస్తుత అధికార పార్టీని ఎలా దించాలి.. ఎంత ఇబ్బంది పెట్టాలి.. నన్ను ఓడిపోయేలా చేసిన ప్రజలను ఎంత కష్టపెట్టాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత లేకుండా ఎలా చేయాలి అనే ఆలోచనలతో చంద్రబాబు నాయుడు చెయ్యని పని అంటూ లేదు.. అవకాశం వస్తే చాలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు అంటడు.. దీక్షలు అంటడు.. 

 

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ నెల క్రితం 3 రాజధానుల విషయం చెప్పాడు.. ఇంకా అంతే.. రాజధాని రైతులను రెచ్చగొట్టాడు.. వారితో నిరసనలు.. గొడవలు చేయించాడు.. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టింది. బాబుకు అన్ని విధాలా రాజ‌ధాని వ్యూహం బెడిసి కొట్టింది.. రాజ‌కీయ వ్యూహం విష‌యంలో చంద్ర‌బాబు మ‌రోసారి అడుసులో కాలేశార‌నే అభిప్రాయం ప్రస్తుతం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజ‌ధాని విష‌యాన్ని తీసుకుని మిగిలిన మూడు ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు దూర‌మ‌య్యాడు.. ఇప్పుడు ఏపీలో సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తా ప్రజలకు కూడా చంద్రబాబు దూరమయ్యాడు అనేది ప్రస్తుతం నిజం.. కేవలం ఒక్క రాజధానిని పట్టుకొని కూర్చున్న చంద్రబాబు.. ఆ రాజధాని ప్రజలతో సైతం ముయించుకునే రోజు త్వరలోనే వస్తుంది అని అంటున్నారు నెటిజన్లు. మరి చంద్రబాబు గతి ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: