చంద్రబాబునాయుడు శాడిజం మరోసారి బయటపడింది.  అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను శాసనమండలిలో కూడా  మామూలుగా అయితే గెలిపించటమో  లేకపోతే ఓడ గొట్టడమో  జరుగుతుంది. అంతేకానీ సెలక్ట్ కమిటికి పంపాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా మండలిలో బిల్లులపై చర్చ జరగకుండా, ఓటింగ్ జగరకుండా సెలక్ట్ కమిటికి పంపేశారు. అందులోను సెలక్ట్ కమిటికి పంపాలని సభ్యుల ఓటింగ్ ద్వారా కాకుండా ఛైర్మన్ విచక్షాధికారాలతో అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది.

 

ఇక్కడే చంద్రబాబు శాడిజం బయటపడింది. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై అసెంబ్లీ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. అయితే మెజారిటి కారణంగా బిల్లులకు సభ ఓకే చెప్పింది. అలాగే మండలిలో కూడా చర్చ జరగి  అవసరమైతే  ఓటింగ్ జరగాలి. మండలిలో తనకున్న మెజారిటి కారణంగా బిల్లులపై అసలు చర్చనే జరగకుండా  రెండు రోజులు పెండింగ్ లో పెట్టించిన టిడిపి చివరకు ఛైర్మన్ మ్యానేజ్  చేసి ఏకపక్షంగా సెలక్ట్ కమిటికి పంపేసింది.

 

ఏకపక్షంగా షరీఫ్ ఎందుకు తనంతట తానుగా సెలక్ట్ కమిటికి పంపుతు ప్రకటించారంటే కేవలం చంద్రబాబును సంతృప్తి పరచటానికే. ఎందుకంటే అసెంబ్లీలో ఉండాల్సిన చంద్రబాబు మండలి గ్యాలరీలోకి వచ్చారు. ఫరీఫ్ దశాబ్దాల పాటు టిడిపిలో పనిచేస్తున్న షరీఫ్ ను ఎంఎల్సీని చేసి మండలి ఛైర్మన్ గా నియమించింది చంద్రబాబే. తన మనిషే ఛైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ప్రభావితం చేయటానికే చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీలో కూర్చున్నారు.

 

చంద్రబాబును చూడగానే షరీఫ్ కూడా ముందుగా ప్లాన్ వేసుకున్నట్లుగానే  తాను విచక్షాణాధికారాలను ఉపయోగించి బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించేశారు. కొసమెరుపు ఏమిటంటే తాను తప్పు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే  విచాక్షాణిధికారాలను ఉపయోగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించటం. బిల్లులను అసెంబ్లీలో అడ్డుకోలేకపోతున్నందుకు, రాజధానుల తరలింపును అడ్డుకోలేకపోయిన చంద్రబాబు మండలి విషయంలో మాత్రం తన శాడిజంను బయటపెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: