మనం ఎన్నో సార్లు అనుకోని ఉంటాం.. లీడర్ అంటే ఎన్టీఆర్.. జగన్ అని. ఎందుకు ఆలా అంటాము అంటే.. ఎన్టీఆర్ ప్రజల మనసును గెలుచుకున్నాడు.. ప్రజలకు ఎంతో మంచి చేశాడు.. రికార్డు స్థాయిలో పార్టీ పెట్టిన 9 నెలల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చాడు.. వచ్చిన వెంటనే ఆంధ్ర అభివృద్ధి అవ్వడానికి ఎన్నో చేశాడు.. 

 

అలానే.. సీఎం జగన్ కూడా.. అధికారంలోకి రావడానికి ఆలస్యం అయ్యింది కానీ.. ప్రజలను సొంతం చేసుకున్నాడు.. ప్రజల మనసు సొంతం చేసుకున్నాడు.. అందుకే ప్రతిపక్షంలో ఉన్న సరే.. అయ్యా మాకు ఈ కష్టాలు ఉన్నాయి అయ్యా అంటూ చెప్పేవారు.. సీఎం జగన్ అంటే మా అన్న అని అనే వారు.. అప్పట్లో ఎన్టీఆర్ కు.. రాజన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజల నుండి ఏ ప్రేమ దక్కిందో ఇప్పుడు సీఎం జగన్ కు కూడా అలాంటి ప్రేమే దక్కింది. 

 

అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అప్పుడు ఎన్టీఆర్ కు ఏలాంటి ఇబ్బందులు అయితే ఎదురయ్యాయో.. ఇప్పుడు తనకు ఏవ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి ఏంటి అనుకుంటున్నారా మీరే చుడండి.. సీఎం జగన్ పలు బిల్లులను ఆమోదించుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును తిప్పి పంపిన మండలి, నిన్న రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. 

 

అక్కడ టీడీపీ బలంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. అయితే, ఈ పరిస్థితి జగన్‌కే కాదు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు కూడా ఎదురైంది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండేది. కానీ.. మండలికి వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్‌దే హవా కొనసాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అడ్డు తగులుతూ వచ్చింది. దీని వల్ల ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది. 

 

ఎన్టీఆర్‌కు మండలిలో రోశయ్య ముప్పు తిప్పలు పెట్టారని అంటుంటారు. దీంతో.. 1985లో ఆయన మండలిని రద్దు చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నాడు.. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రికార్డు కేవలం ఎన్టీఆర్ కు, సీఎం జగన్ కు మాత్రమే ఉందని తేలిపోతుంది.. మరి సీఎం జగన్ నెక్స్ట్ అడుగు ఏంటో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: