టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు....దివంగత ఎర్రన్నాయుడు తనయుడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే తండ్రి వారసత్వాన్ని ఓ వైపు విజయవంతంగా కొనసాగిస్తూ...రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అలా అరుదుగా సక్సెస్ అవ్వడంలో తన బాస్ కుమారుడు లోకేశ్ ఫెయిల్ అయినా...తాను మాత్రం బాగా సెట్ అయ్యాడు. తొలిసారి 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా బరిలో దిగి అద్భుత విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్ళాడు.

 

ఇక చాలామంది తెలుగు ఎంపీలు మాదిరిగా పార్లమెంట్‌లో ఒక మూలాన కూర్చుకోకుండా,  రాష్ట్రం కోసం తన గళాన్ని గట్టిగా వినిపించాడు. ఆ విధంగా తన సత్తా చాటడంతోనే 2019 ఎన్నికల్లో కూడా మరోసారి విజయం సాధించగలిగారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి ఓ రేంజ్‌లో వీచిన శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచి, పార్లమెంట్ గడప తొక్కాడు. పార్టీ ఇమేజ్‌ సరిగా పనిచేయకపోయిన, తన సొంత ఇమేజ్‌తో నెగ్గుకొచ్చాడు.

 

ఇక ఈ విధంగా రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో మంచి విజయాలు అందుకున్న రామ్మోహన్ భవిష్యత్ ఇప్పుడు చంద్రబాబు ప్రశ్నార్ధకం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులని తన స్వార్ధం కోసం వ్యతిరేకించిన చంద్రబాబు... ఉత్తరాంధ్రలో టీడీపీ భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం వల్ల విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది.

 

కానీ బాబు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడుని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులకు మద్ధతు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కానీ పక్షంలో టీడీపీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెబుతున్నారు. ఇక దీని బట్టి అర్ధం చేసుకుంటే రానున్న రోజుల్లో రామ్మోహన్ తన అధినేత బాటలోనే వెళితే, తన భవిష్యత్తుపై భారీ దెబ్బ తగలడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: