దాదాపుగా మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు పైగా గడుస్తున్నాయి. ఇప్పటికీ ఈ డెబ్భై ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో నాయకులు వచ్చి వెళ్లారు. అయితే వారి వలన ప్రత్యేకంగా దిగువ, పేద వర్గాల వారికి ఒరిగిందంటూ ఏమి లేదనే చెప్పాలి. ధనికులు మరింత ధనికులైతే, పేదలు మరింత పేదలుగా మిగిలిపోయారు. ఇక గత ఎన్నికల సమయలో బిజెపి దేశంలో అధికారాన్ని చేపట్టి, మాది పేదల పక్షపాత ప్రభుత్వం అని మాటలు మాత్రం గొప్పగా చెప్పుకున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అది వీసమంతైనా అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా ఆ సమయంలో ప్రధాని  నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటివలన నల్లధనం రూపుమాపడం సంగతి ఏమో కానీ, దాని వలన దిగువ వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే కొన్ని కులమతాలకు అనుకూలం అని, అలానే బీజేపీకి గెలిస్తే మరికొన్ని కులమతాలకు అనుకూడాలం అనే వాదన కూడా మన దేశంలో బలంగా ఉంది. 

 

ఇక ఇటీవల బిజెపి గెలుపు తరువాత కొందరిపై బలవంతంగా హైందత్వ పద్దతులను అంటగట్టడంతో పాటు గోవధ నిషేధం వంటి విధానాల ద్వారా మైనారిటీలను మరింతగా హింసిస్తున్నారు. ఇక వాటితో పాటు పేదవారికి ఏ మాత్రం ఉపయోగపడని సంక్షేమపథకాల అమలు వలన ఉన్నవారిని అవి మరింతగా పెంచి పోషిస్తున్నాయి. దాదాపుగా 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఇప్పకిటీకీ కూడా మెజారిటీ ప్రజలకు మూడు పూట్ల ముద్ద నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో కార్పొరేట్  సంస్థలని పెంచి[పోషించడం వలన వారు మరింతగా లాభాలు పొంది మనపైనే జులూం చేసే పరిస్థితికి వచ్చారు. కులం, మతం, స్త్రీలు, పురుషులు అన్న భేదం లేకుండా అందరి స్థాయీ ఒకటే అని, అలానే అందరికీ సమానావకాశలు ఉంటాయని రాజ్యాంగం చెప్తున్నా అవి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక రాను రాను మహిళల మీద అత్యాచారాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇక దేశంలో దళితుల అణచివేత కూడా మరింత ఎక్కువ అయింది. 

 

ఇటీవల రోహిత్ వేముల వంటి కొందరు వారి జాతి రక్షణకు ఆత్మహత్య చేసుకోక తప్పని పరిస్థితి. ముఖ్యంగా వ్యక్తి గౌరవం ఎందుకూ కొరగానిదైపోయింది. మనమే రూపొందించుకున్న 'భారతీయులమైన మనం అందరం సమానమే' అనే మాట, కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయింది. మన గణతంత్రానికి విఘాతం కలిగించే ఇటువంటి ధోరణులను ప్రతిఘటించాలి. అలానే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మన స్వాతంత్ర్యానికి, సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడుతోంది. అంతర్జాతీయ రంగంలో మనం స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాం. భారత్, అమెరికా వంటి అగ్ర రాజ్యాల తోకలా మారిపోయి, లాభాపేక్ష తప్ప మరో ధ్యాస లేని పెట్టుబడిదారులకు ఊడిగం చేసే స్థితికి దిగజారింది. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు పూర్తిగా రూపుమాపబడతాయో, అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం లభించినట్లు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: