సూపర్‌స్టార్ రజినీకాంత్ సాధారణంగా ఎవరి మీద అనవసరమైన కామెంట్స్ చేయరు. అంతేకాదు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు. ఇక సాధ్యమైనంత వరకు ఏ ఒక్కరి మీద చిన్న మాట అనే ప్రయత్నం కూడా చేయరు. అలాంటిది ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌పై సూపర్‌స్టార్ రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తమిళనాడు రాష్ట్రం సీరీయస్ అయ్యారు. అంతేకాదు సూఅర్ స్టార్ అని కూడా చూడకుండా ఆయనపై పోలీసు కేసు కూడా పెట్టారు. రజినీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ రజినీ ఈ తతంగాన్ని అసలు లెక్క కూడా చేయలేదు. ఎవరెవరు ఏమేమి మాట్లాడినా నేను మాత్రం అస్సలు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదై తన స్టైల్లో అన్నారు. ఇది అదునుగా చూసుకొని అన్నాడీఎంకే నేత సెల్లూర్ రాజా.. రజినీ ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగారు. రజినీ రెండో కూతురు సౌందర్య గతేడాది సినీ నటుడు విశాఖన్ వనగమూడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సౌందర్యకు విశాఖన్‌కు ఇది రెండో పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అంతేకాదు ఇది కారణంగా చూపించి పెరియార్‌పై రజినీకాంత్ ఆ వ్యాఖ్యలు చేయడం అనవసరం. 50 ఏళ్ల క్రితం ఏదో మ్యాగజైన్‌‌లో పబ్లిష్ అయిన విషయం ఇఫ్పుడు మాట్లాడాల్సిన అవసరమేమిటి. పెరియార్ కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎన్నో మంచి పనులు చేశారు. సమాజంలో వెంటాడుతున్న చెడును తరిమికొట్టారు. రజినీకాంత్ కూతురు సౌందర్య రెండో పెళ్లి ఎలా చేసుకోగలిగారు? పెరియార్ ఆలోచనా విధానాల వల్ల సమాజంలో వచ్చిన మార్పు వల్లే కదా. అలాంటప్పుడు రజినీ పెరియార్‌ను తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదు .. అని వెల్లడించారు.

 

ది న్యూస్‌ మినిట్‌ కథనం మేరకు ఈ నెల 14న జరిగిన తుగ్లక్‌ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీ తందై పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించినట్టుగా ది న్యూస్‌ మినిట్‌ పేర్కొంది. అంతేకాదు ఆ సమయంలో ఒక్క తమిళ మేగజైన్‌ మాత్రం ఈ వార్తను ప్రచురించిందని ప్రభుత్వం ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడిందని రజనీ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిపారు. మరి ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా ముదిరి పెద్దదవుతుందా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: