2014 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి సభ్యులను అన్యాయంగా 23 మందిని రాజీనామా చేయించకుండా తన పార్టీలోకి తీసుకోవటం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలకు గాను 23 మంది ఎమ్మెల్యేలను గెలవడంతో సరైన తీర్పు దేవుడు మరియు ఆంధ్ర ప్రజలు ఇచ్చారని తాను తీసిన గోతిలో తానే పడ్డాడని అది కూడా మే 23 వ తారీఖున చంద్రబాబుకి తీర్పు వచ్చిందని తన పార్టీ సభ్యులను ఎంతమంది నైతే గతంలో చంద్రబాబు అన్యాయంగా తీసుకోవటం జరిగిందో అదే నెంబర్ మళ్లీ చంద్రబాబు కి వచ్చిందని ఆ సమయంలో గెలిచిన వైయస్ జగన్ చంద్రబాబు పై కామెంట్ చేశారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ప్రజలు కూడా అదే స్థాయిలో తీర్పు ఇచ్చారని కామెంట్లు చేశారు.

 

ఇకపోతే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందేలా వ్యవహరించిన జగన్ కి శాసనమండలిలో జనవరి 22వ తారీఖున చంద్రబాబు అడ్డుకోవటంతో మూడు రాజధానుల నిర్ణయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. శాసన మండలి లో ఉన్న చైర్మన్ ఇలాంటి బిల్లును అడ్డుకోవడం చాలా తప్పు అని తెలిసినా కానీ విచక్షణ అధికారం ఉపయోగించి సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు.. చేసిన తప్పును ఒప్పుకుంటూ నే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడంతో శాసనమండలి చైర్మన్ వ్యవహరించిన తీరు పట్ల ఏపీ అధికార పార్టీకి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

అయితే జనవరి 23 వ తారీకు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయన బర్త్ డే రోజునే మండలి రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. శాసన మండలి రద్దు చేస్తే కచ్చితంగా వారంలో బిల్లు మళ్లీ పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో సీఎం జగన్ ఉన్న దూకుడును బట్టి చూస్తే..ఒక వారంలోపు లోనే ఏపీ మండలి రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఏపీ మీడియా వర్గాలో గట్టిగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో తాజాగా మండలి రద్దు అంశం లోకేష్ పుట్టిన రోజు నాడు జగన్ తెరపైకి తీసుకురావడంతో అది కూడా 23 వ తేదీన చంద్రబాబుకి ఇంకా 23 వ నెంబర్ దరిద్రం వదల్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: