టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్‌ను మోసం చేశారన్న ఆరోపణలపై.. అజర్ సహా మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ట్రావెల్ ఏజెంట్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.

 

మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను మోసం చేశారనే ఆరోపణలపై అజహరుద్దీన్‌తో సహా మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఔరంగాబాద్‌కు చెందిన షాహబ్‌ మొహమ్మద్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్ ఫిర్యాదుమేరకు.. మజీబ్‌ఖాన్‌, సుధీష్‌ అవిక్కల్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

 

విమాన టికెట్ల డబ్బుల గురించి అజహరుద్దీన్, ముజీబ్ ఖాన్లను సంప్రదించినా.. వారిద్దరూ పట్టించుకోలేదన్నారు ట్రావెల్ ఏజెంట్. నవంబర్ 24న అవిక్కల్ .. తన ట్రావెల్ ఏజెన్సీ పేరిట మొత్త 21 లక్షల 45 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఓ చెక్ ఫోటోను.. తన వాట్సాప్‌కు పంపారని, కానీ ఇప్పటివరకూ డబ్బులు జమకాలేదన్నారు.  అయితే.  అజహరుద్దీన్.. ఈ ఫిర్యాదుపై ట్విట్టర్లో స్పందించారు.తానెవరినీ మోసం చేయలేదని.. ఇవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, తదుపరి చర్యలపై ,న్యాయవాదులతో సంప్రదిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 

 

2019 నవంబర్‌ 9 నుంచి నవంబర్‌ 12 వరకు సుధీష్‌ అవిక్కల్‌ అనే వ్యక్తి... తనతో అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేయించారని ట్రావెల్ ఏజెంట్ షాహబ్ మొహమ్మద్ ఫిర్యాదులో పేర్కొన్నారు.ముంబయి-దుబాయ్‌-పారిస్‌, పారిస్‌- ట్యూరిన్‌, ట్యూరిన్‌-పారిస్‌, ట్యూరిన్‌-ఆమ్‌స్టర్‌డామ్‌, ట్యూరిన్‌-మ్యూనిచ్-ఆమ్‌స్టర్‌డామ్‌ ఇలా అనేక టికెట్లు తీసుకున్నారని, అందులో అజహరుద్దీన్‌, అవిక్కల్‌ ప్రయాణించారని షాహబ్ తెలిపారు. టూర్ సమయంలో డబ్బులు లేవని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అవిక్కల్ తన చెప్పారని, అజహరుద్దీన్ వ్యక్తిగత తసిబ్బంది హామీ ఇవ్వడంతో తాను చెల్లించానన్నారు.నవంబర్ 12న ,డబ్బు జమ చేస్తున్నానని అవిక్కల్ చెప్పినా.. అవి జమకాలేదని ఫిర్యాదీ దారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: