జనవరి 24వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి చూసి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 భీమవరపు నరసింహారావు జననం : 1905 జనవరి 24వ తేదీన భీమవరపు నరసింహారావు జన్మించారు. తెలుగు సినిమా సంగీత దర్శకుడైన భీమవరపు నరసింహారావు మొదటి తరం సంగీత దర్శకులలో  ఓ వెలుగు వెలిగారు. ఈయన బీఎన్నార్ గా అందరికీ సుపరిచితులు. ఎన్నో చిత్రాలకు  సంగీతాన్ని సమకూర్చి... ఎంతో పేరును గడించారు భీమవరపు నరసింహారావు.. తనదైనా సంగీతం తో ప్రేక్షకులను ఎంతగానే అలరించారు. 

 

 రియాసేన్ జననం : ప్రముఖ బాలీవుడ్ నటి రియా సేన్  1982 జనవరి 24వ తేదీన కోల్కతాలో జన్మించారు. 1991 సంవత్సరం నుంచి కెరీర్ ని ప్రారంభించిన రియా సేన్ ... చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మరి ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు రియా సేన్ . మరోవైపు మోడల్ కూడా దూసుకుపోయారు . అంతే కాకుండా ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి  కీలకంగా  వ్యవహరించారు. ఇక తన హాట్ హాట్ అందాలతో కూడా బాలీవుడ్ ప్రేక్షకుల మతి పోగొట్టింది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటో షూట్లతో బాలీవుడ్ అభిమానులందరి మతి పోగొట్టింది ఈ అమ్మడు . అంతే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టింది రియా సేన్ .

 

 రియా సేన్  బాలీవుడ్తో పాటు ఎన్నో తెలుగు మలయాళం కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇక ఎన్నో ఫ్యాషన్ షోలలో  కూడా పాల్గొంది ఈ బాలీవుడ్ నటి. ఇక తెలుగులో కూడా ఈ అమ్మడు మంచూ మనోజ్ హీరోగా నటించిన  నేను మీకు తెలుసా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మడు నటనతో  అదరగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: