ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అధికార పార్టీ వైసిపి మరియు తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం సాగుతోంది. వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చి దాన్ని బిల్లుగా అసెంబ్లీలో ఆమోదం పొందేలా వైయస్ జగన్ వ్యవహరించడంతో జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో అసెంబ్లీలో అడ్డు పడటం జరిగింది. శాసనసభ్యులచేత ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ నేతలకు బలం ఎక్కువగా ఉండటంతో శాసనమండలి చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంతో వైయస్ జగన్ తీవ్ర స్థాయిలో శాసనమండలిలో జరిగిన తీరు పట్ల గురువారం జరిగిన అసెంబ్లీ లో చిరాకు పడ్డారు. రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులచేత ఆమోదం పొందిన బిల్లును శాసనమండలిలో గౌరవంగా వ్యవహరించాల్సిన చైర్మన్ తనకు ఇష్టం లేదని వికేంద్రీకరణ బిల్లు పట్ల వ్యవహరించిన తీరు పట్ల అసెంబ్లీలో జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది.

 

అసలు శాసనమండలి అనేది సలహాలు సూచనలు ఇచ్చే పెద్దల సభగా ఉండాలని కానీ శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభ శాసన మండలి తయారయిందని జగన్ ఆవేదన చెందారు. ఇటువంటి సభలో తప్పు అని తెలిసినా కూడా ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జగన్. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి తరుణంలో ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులచేత ఆమోదం పొందిన బిల్లులను ఒక ఉద్దేశపూర్వకంగా శాసన మండలి ఆపుతున్న తరుణంలో శాసనసభ్యులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన మనం ఇటువంటి చర్యలను ఖండించాలి అని అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.

 

దేశంలోనే ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి సభ ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలా అని గమనించాలని శాసన సభ్యులంతా ఈ విషయంపై సోమవారం తమ అభిప్రాయాలు తెలియజేయాలని ముఖ్యంగా శాసన మండలి సభ నిర్వహించడానికి సంవత్సరానికి 60 కోట్లు ఖర్చవుతుందని దీన్ని ఆలోచించి సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్కరు నిర్ణయాలు తెలియజేయాలని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కి టైం ఫిక్స్ అయ్యేలా శాసన మండలి రద్దు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: