కొన్నేళ్ల పాటు మన దేశాన్ని బ్రిటీష్ పాలకులు ఎంతో నిరంకుశంగా పాలించిన తరువాత, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో త్యాగధనులు దేశాన్ని పట్టి పీడిస్తున్న తెల్లదొరలను తరిమి కొట్టి ప్రజలకు స్వతంత్రం తెచ్చేలా ఆఖరుకి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఇక ఎట్టకేలకు ఎన్నో ఉద్యమాల తరువాత మన దేశానికి 1947, ఆగష్టు 15న స్వాతంత్రం లభించింది. అయితే తరువాత స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్ కు స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం, సమానత్వం, న్యాయం, ధర్మం వంటి అంశాలతో కూడిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం తాయారు చేయడం జరిగింది. అయితే రాజ్యాంగ రూపకల్పన 1949 ఆఖరులోనే జరిగినప్పటికీ, దానిని పూర్తి స్థాయిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించదానికి రెండు నెలల సమయం పట్టడంతో చివరికి దానికి ఆమోదం 1950 జనవరి 26న జరిగింది. 

 

కావున దానిని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అనగా దేశంలోని ప్రజలందరూ కూడా చట్టం ముందు సమానులే, అలానే ప్రజలకు వాక్ స్వాతంత్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులు రాజ్యంగా బద్దంగా అప్పటినుండి లభించాయి. అయితే అది మాత్రం రాను రాను మాటలకు మాత్రమే పరిమితం అవుతూ చేతల్లో మాత్రం ఆచరణ సాధ్యం కాకుండా పోతోంది. మధ్యలో పలు ప్రభుత్వాలు మారడంతో పాటు పలు పార్టీలు అధికారాన్ని చేపట్టి ప్రజలను పాలించాయి. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా, నాటి త్యాగధనుల కలలకు చిహ్నంగా ఉన్న ప్రజలందరూ సమానమే అనే భావన మాత్రం ఇప్పటికీ అమలు కావడం లేదు. ఎప్పటికప్పుడు వస్తున్న ప్రభుత్వ పాలకులు తమకు అనునాయులుగా ఉంటున్న వారినే బాగు చేసుకోవడం, అందినకాడికి డబ్బులు దండుకుని తమవారికి మాత్రమే పదవులు కట్టబెట్టడం, 

 

అలానే ఎప్పటికప్పుడు ఉన్నవాడిని మరింత ఉన్నవాడిని చేసేలా ప్రభుత్వ పధకాలు రూపొందించడం వంటివి అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇదేనా నాటి గొప్ప గొప్ప త్యాగమూర్తులు మన నుండి ఆశించిన స్వరాజ్యం. ఇక ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు ప్రజానాయకులు, అధికారులు ఏదో మొక్కుబడికి తప్పనిసరిగా జండా వందనం చేయడం, సైనిక కవాతులు నిర్వహించడం మాత్రం తూచా తప్పుకున్న చేస్తున్నారు తప్ప, దానికి ఉన్న అసలైన ప్రాధాన్యతను మాత్రం పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఇకనైనా మన పాలకులు నిద్ర లేచి దేశం, ప్రజలు, వారి సమస్యలపై దృష్టి పెట్టి దిగువ వర్గాల వారికి మేలు చేసే పధకాలు, విధానాలు అమలు చేస్తే బాగుంటుంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: