శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది . సోమవారం మండలి రద్దుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది . మండలి రద్దు అయితే , కేబినెట్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తెలెత్తుతోంది . జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం లో మండలి సభ్యులు subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకట రమణ లు మంత్రులు గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే . సోమవారం మండలిని రద్దు చేసినా,  వీరిద్దరి పదవికి ఆర్నెళ్ల వరకు వచ్చిన ఢోకా ఏమి లేదు .

 

 ఆ తరువాత వీరిని మంత్రివర్గం లో ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది . చట్టసభల్లో సభ్యులు కానీ వారిని కూడా మంత్రివర్గం లోకి తీసుకోవచ్చు . అయితే ఆర్నెళ్లలో వారు ఏదో  ఒక సభలో సభ్యులు కావాల్సి ఉంటుంది . ప్రస్తుతం మండలి సభ్యులుగా ఉన్న వీరిద్దర్నీ జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ, ఒకవేళ  మండలిని రద్దు చేస్తే వీరిని  మంత్రులుగా కొనసాగించాలంటే మాత్రం ఎదో ఒక నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిపించుకోవాల్సిందే . అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడప్పుడే ఏ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు కూడా లేవు . దీనితో ఈ ఇద్దరు మంత్రులు ఆర్నెళ్ల  తరువాతయిన మాజీలు కావాల్సిందేనన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

జగన్ కు అత్యంత సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్ర బోస్ , మోపిదేవి వెంకట రమణలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు . అసెంబ్లీ ఎన్నికల్లోఓడినా,  వారి పట్ల తనకున్న వాత్సల్యం తో ఇద్దర్నీ  మంత్రివర్గం లోకి తీసుకున్నారు . ఇక subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టిన జగన్ , మోపిదేవి కి కీలక శాఖ  అప్పగించి తనని నమ్ముకున్న వారికి   ఎప్పుడూ   దన్నుగానే ఉంటానన్న సంకేతాలను పంపారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: