శాస‌నమండ‌లి మంట‌లు జ‌గ‌న్ కొంపకు అంటుకున్నాయి. శాస‌న‌మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లు సెలెక్ట్ క‌మిటీకి చైర్మ‌న్‌కి రిఫ‌ర్ చేయ‌డంతో జ‌గ‌న్ తీవ్ర అవ‌మాన‌భారంతో కుంగిపోయారు. ఒకానొక ద‌శ‌లో త‌న‌ను క‌లిసిన మంత్రుల్ని, విజ‌య‌సాయిరెడ్డిని అమ్మ‌నాబూతులు తిట్టి నెట్టేశార‌ట‌. అప్ర‌తిహ‌త‌మైన గెలుపు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు చేజిక్కించుకుని త‌న‌కు ఎదురులేద‌నే స్థాయిలో నిరంకుశ నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌కు మండ‌లిలో ఎదురైన ప‌రాభ‌వం జీర్ణించుకోలేక‌పోతున్నాడ‌ని స‌మాచారం. దీంతో ఎన్ని అడ్డంకులున్నా, త‌న‌కు పంటికింద రాయిలా మారి కంటిమీద కునుకులేకుండా చేసిన మండ‌లిని ర‌ద్దు చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. జ‌గ‌న్ ఒక్క‌సారి క‌మిటైతే త‌న మాట తానే విన‌డు. అంటే ఎన్ని అడ్డంకులెదురైనా శాస‌న‌మండ‌లిని ర‌ద్దుకే జ‌గ‌న్ మొగ్గుచూపుతున్నాడు. ఈ నిర్ణ‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతుండ‌గానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో అస‌మ్మ‌తి జ్వాలల రేగి తాడేప‌ల్లి కొంప‌ని తాకాయి. శాస‌న‌మండ‌లి ర‌ద్దు చేస్తే పార్టీని వీడేందుకు సిద్ధం అంటూ నాయ‌కులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

 

 వైకాపాలో బీసీ నేత‌ల‌కు ఝుల‌క్‌

 ప్ర‌స్తుతం వైకాపా త‌ర‌ఫున ఉన్న 9 మంది ఎమ్మెల్సీలు కూడా శాస‌న‌మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యంపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో  పిల్లి సుబాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణలు క్యాబినెట్‌లో కీల‌క మంత్రులుగా ఉన్నారు. ఇద్ద‌రూ బీసీ వ‌ర్గానికి చెందిన వారే. వీరితోపాటు వైకాపాకి బీసీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న జంగా క్రిష్ణ‌మూర్తి కూడా మండ‌లి ర‌ద్దు చేస్తే ఎమ్మెల్సీ ప‌ద‌విని కోల్పోతారు. 

 

50మందికి హ్యాండివ్వ‌బోతున్న జ‌గ‌న్‌

మొన్న ఎన్నిక‌ల్లో వైకాపా 151 సీట్లు గెల‌వడానికి వీలుగా కొంత‌మంది నేత‌లు స‌హ‌క‌రించారు. మ‌రికొంద‌రు ఎమ్మెల్యే రేసు నుంచి త‌ప్పుకునేందుకు ఎమ్మెల్సీ హామీ తీసుకున్నారు. అలాగే కొత్త‌గా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్సీ ఇస్తామ‌ని జ‌గ‌న్ మాటిచ్చారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, కాండ్రు క‌మ‌ల‌, కిల్లి కృపారాణితోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా 50 మందికి పైగా ఎమ్మెల్సీల‌ను చేస్తామ‌ని జ‌గ‌న్ ఇచ్చిన మాట‌..శాస‌న‌మండ‌లి ర‌ద్దుతో ర‌ద్దు కానుంది. 

 

మండ‌లి ర‌ద్దుతో వైకాపాకి న‌ష్టం

ఇప్ప‌టికిప్పుడు శాస‌న‌మండ‌లి ర‌ద్దు వ‌ల్ల తెలుగుదేశం పార్టీకి పెద్ద‌గా న‌ష్టం ఏమీ లేదు. గ‌రిష్టంగా టీడీపీ ఎమ్మెల్సీ ప‌దవీకాలం 2 ఏళ్ల‌కు మించి లేదు. ఆ త‌రువాత ఎమ్మెల్యే కోటా, నామినేటెడ్ కోటా అన్నీ వైకాపాకే ద‌క్కుతాయి. టీడీపీకి ఎమ్మెల్యేల సంఖ్య‌ప‌రంగా వ‌స్తే ఒక ఎమ్మెల్సీ రావొచ్చు. స్థానిక సంస్థ‌లు, ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాలు, ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలు స‌రే స‌రి. శాస‌న‌మండ‌లిలో పూర్తిస్థాయి ఎమ్మెల్సీలంతా త‌న పార్టీకే ద‌క్కే అవ‌కాశాన్ని జ‌గ‌న్ జార‌విడుచుకోవ‌డంపైనా సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు.

 

కోట్ల‌లో కొనుగోలు..అమ్మ‌కాలు బాకీలెలా తీరుతాయి?

బీద మ‌స్తాన్‌రావుకి రాజ్య‌స‌భ ఇస్తామ‌ని వంద‌కోట్లు జ‌గ‌న్ తీసుకుని పార్టీలో చేర్చుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అలాగే ఒక్కో ఎమ్మెల్సీ కోసం 20 కోట్లు రేట్లు పెట్టి  ఆల్రెడీ అమ్మేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో శాస‌న‌మండ‌లి ర‌ద్ద‌యితే వీళ్లంద‌రూ ఎమ్మెల్సీ పోస్టు కోసం చెల్లించిన కోట్లు తిరిగి ఎలా చెల్లిస్తార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు శాస‌న‌మండ‌లిలో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్సీల‌కు ఒక్కొక్క‌రికీ 15 కోట్లిచ్చి సంత‌లో ప‌శువుల్లా కొన్నారు జ‌గ‌న్‌. ఇప్పుడు టీడీపీ అన‌ర్హ‌త వేటుకు నోటీసు ఇస్తే వారిద్ద‌రికీ ఉన్న ప‌ద‌వులు కోల్పోతారు. మ‌రి వైకాపా వైపు జంప్ ఇచ్చినందుకు వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే మండ‌లి ర‌ద్దుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కోట్ల‌లో సాగిన కొనుగోలు-అమ్మ‌కాలు వ్య‌వ‌హారం మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం వైపు జ‌గ‌న్ సాగుతుండ‌టంతో వైకాపాలో ర‌చ్చ ర‌చ్చ రేపుతోంది.

 

జ‌గ‌న్ అధికారం కోల్పోతే మండ‌లే దిక్కు

శాస‌న మండ‌లిని ఇప్పుడు ర‌ద్దు చేసే ఆలోచ‌నను జ‌గ‌న్ విర‌మించుకుంటే వచ్చే 2022 నాటికి మండలిలో వైకాపాకే పూర్తి మెజారిటీ వ‌స్తుంది. అనంత‌రం శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయినా మండ‌లిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాదిరిగానే వైకాపా ఆధిప‌త్యం సాగించే అద్భుత అవ‌కాశం ద‌క్కుతుంది. ఇటువంటి బంగారంలాంటి అవకాశాన్ని జ‌గ‌న్ వ‌దులుకోడ‌ని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుంటే.. జ‌గ‌న్ ఎవ్వ‌రి మాటా వినే ర‌కం కాద‌ని, త‌న‌కు ప‌రాభ‌వం అనుకున్న దేన్న‌యినా ర‌ద్దు చేసి పారేస్తాడ‌ని అంటున్నారు. ఒక‌వేళ మండ‌లి ర‌ద్దు చేయ‌కుండా ఉంటే వచ్చేసారి టీడీపీ అధికారంలోకొచ్చినా మండ‌లిలో గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటుంద‌ని అంటున్నారు.

 

అల‌క‌లు, పార్టీమారే నా

శాస‌న మండ‌లి ర‌ద్దు అయితే వైకాపాకి ఉన్న 9 మంది ఎమ్మెల్సీలను కోల్పోతారు. రానున్న రోజుల్లో ద‌క్కే అత్య‌ధిక స్థానాలు పోగొట్టుకున్న‌ట్ట‌వుతుంది. అలాగే పార్టీకి క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన వారికి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఇచ్చిన హామీ నెర‌వేర్చే అవ‌కాశం ద‌క్క‌దు. అలాగే కోట్లు ఇచ్చి ప‌ద‌వుల కోసం క‌ళ్లు కాయ‌లుకాచిన‌ట్టు ఎదురుచూస్తున్న‌వారికి అసంతృప్తి రేగుతోంది. తాను ప‌ట్టిన కుందేలుకు అస‌లు కాళ్లే లేవ‌నే టైపులో వ్య‌వ‌హ‌రించే జ‌గ‌న్ త‌న‌కు తీవ్ర ప‌రాభ‌వం మిగిల్చిన మండ‌లిన ర‌ద్దు చేసేందుకే మొగ్గుచూపుతున్నార‌ని, ఇప్ప‌టి నుంచి వైకాపాలో అల‌క‌లు, అసంతృప్తులు మొద‌ల‌య్యాయి. కొంద‌రైతే పార్టీని వీడేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: