వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ‌ మంత్రి కే. తారకరామారావుకి అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ (IGWEL) సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం వరల్డ్ ఎకనామిక్ ఫోరం పంపింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే సాధారణంగా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో కేటీఆర్ ఒక్కరే  ఉండడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు అని అంటున్నారు.

 

ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక బ్యాడ్జ్ ను అందించింది. ఈ సమావేశం ప్రపంచ లీడర్లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడుకునే అవకాశాన్ని వరల్డ్ ఎకానామిక్ ఫోరం కల్పిస్తుంది. ఇందుకోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సెర్బియా ప్రధానమంత్రి అన బ్రాన‌బిక్‌, పోలాండ్ ప్రధాని మాటెజ్జ్ మోర్వావిస్కీ, ఈస్టోనియా ప్రధాని జ్యూరీ రిట‌స్‌ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, బోట్స్ వానా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ఇదిలాఉండ‌గా, దావోస్‌లో వరుసగా మూడోరోజు మంత్రి కే. తారకరామారావు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా ఆల్ స్వాహ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు సౌదీ మంత్రినీ తెలంగాణకి కేటీఆర్ ఆహ్వానించారు. మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తో కూడా మంత్రి సమావేశమయ్యారు.  డెన్మార్క్కు చెందిన మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ నోవో నోర్ డిస్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తో తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్  ఆఫ్ హైదరాబాద్ (రిచ్) తో మరియు బయో ఆసియాతో భాగస్వామ్యలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. మైక్రన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మహోత్ర  మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. 

 

దావోస్‌లో జరిగిన మరో బిజినెస్ మీటింగ్ లో కోకో కోలా కంపెనీ సీఈవో జేమ్స్ క్వెన్సి మంత్రిని కలిశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ సీఈవో సుసాన్  వొజ్విక్కి తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరం తమకు ప్రాధాన్యత ప్రాంతమని మంత్రి కేటీఆర్ కు ఆమె తెలిపారు. ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లో తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న లైఫ్ సైన్స్ మరియు ఫార్మా రంగా ఈకో సిస్టం మరియు డిజిటల్ డిస్కవరీ రంగంలో వస్తున్న వినూత్నమైన ట్రెండ్స్ , ఫార్మాస్యూటికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ వంటి అనేక అంశాల పైన ఈ సందర్భంగా చర్చించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్ యమ్ ఈ మరియు స్టార్టప్ శాఖల మంత్రి యంగ్ సున్ తో సమావేశమయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, పబ్లిక్ పాలసీ  ఉపాధ్యక్షుడు మైఖేల్ పుంకే మంత్రి కేటీఆర్  తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. సాఫ్ట్ బ్యాంక్, సీనియర్ మేనేజింగ్ పార్ట్నర్ దీప్ నిషార్ మంత్రిని కలిశారు. నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాన్సన్ తో సమావేశమైన మంత్రి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మరియు యానిమల్ హస్బండ్రీ రంగాల్లో చేపట్టిన పలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: