ప్రస్తుతం పుట్టినరోజు వస్తే చాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పుట్టినరోజు వచ్చింది అంటే మందు విందు తప్పనిసరిగా ఉండాల్సిందే. అది లేకపోతే మాత్రం  అందరూ హార్ట్ అయిపోతారు. కానీ ఇక్కడ ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకల్లో  ఓ వ్యక్తి ప్రాణం తీసాయి. ఆనందంగా జరుపుకునే పుట్టినరోజు వేడుకల్లో  విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఓ వ్యక్తి తన స్నేహితులకు ఇచ్చిన మందు పార్టీ ఓ స్నేహితుడు ప్రాణం తీసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రుద్రరం గ్రామంలో ఓ వ్యక్తి అధికంగా మద్యం సేవించి మృత్యువాత పడ్డాడు.

 

 జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ గోస్వామి .. అతని బంధువైన సుజిత్ కుమార్ గురుస్వామి ఇద్దరు పిల్లలతో  బ్రతుకు తెరువు కోసం వచ్చే స్థానిక గీతం విశ్వవిద్యాలయం లో క్యాంటిన్ లో  వంటల మాస్టర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అదే  క్యాంటీన్లో తనతో పాటు పనిచేసి సంతోష్ కుమార్ అనే వ్యక్తి కొడుకు  పుట్టినరోజు కావడంతో.. ఫంక్షన్ ఏర్పాటు చేసి తనతో పాటు క్యాంటీన్ లో పనిచేసే వారందరిని పుట్టినరోజు వేడుకలకు పిలిచాడు.

 

 

 ఈ పుట్టినరోజు వేడుకల్లో పలువురు బంధు మిత్రులతో పాటు క్యాంటీన్ లో పనిచేసే సుజిత్ గోస్వామి  సంజయ్ కో స్వామి తో పాటు మిగతా కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారు. ఈ  పుట్టినరోజు వేడుకల్లో సంజయ్ గోస్వామి అనే వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. అనంతరం భోజనం చేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అనంతరం నిద్ర లేవకపోవడం తో సుజిత్ గోస్వామి  పరిశీలించగా అప్పటికే మరణించినట్లు తెలిసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడం ఆ వ్యక్తి మరణించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: