ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసి తమ ఖాతాదారులకు భారీ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. ఎల్ఐసి సంస్థ ఈ విధంగా 23కిపైగా పాలసీలను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికలను గమనిస్తే ఇదే స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఈ అంశం ఎల్ఐసి పాలసీదారుల్లో  ప్రతికూల ప్రభావం  తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి 31 తారీఖు నుంచి ఎల్ఐసీకి చెందిన 23 పాలసీలు చెల్లుబాటు కావు అని  ప్రస్తుతం వెలువడుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. ఎల్ఐసి  తన 23 పాలసీలో ముఖ్యంగా న్యూ జీవన్ ఆనంద్జీవన్ ఉమాంగ్,  లక్ష్య  వంటి ప్రముఖ పాలసీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 23 పాలసీలను రద్దు చేసి ఫిబ్రవరి 1 నుంచి కొత్త పాలసీలు తీసుకురావాలని ఎల్ఐసి భావిస్తున్నట్లు సమాచారం. 

 

 

 ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఎఐ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల నేపథ్యంలో.. ఎల్ఐసి సంస్థ తమ పాలసీలను రద్దు చేస్తున్నట్లు  అర్థమవుతుంది. ఐఆర్డిఎఐ  నిబంధనలకు అనుగుణంగానే పాత పాలసీలను రద్దు చేసి పాత పాలసీల  స్థానంలో కొత్త పాలసీలు తీసుకురావచ్చు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా  ఈ వార్తలే కాదు  మరికొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కొత్త పాలసీలపై రాబడి  కూడా తక్కువగా ఉండొచ్చని సమాచారం. అంతేకాకుండా పాలసీ ప్రీమియం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగానే... అన్ని  పాలసీలు ఉండాలని ఐఆర్డిఎఐ నిర్ణయించింది. అందుకే ఐఆర్డిఏఐ కొత్త రూల్స్ ను తీసుకు వచ్చినట్లు సమాచారం. 

 

 

 అంతేకాకుండా పాలక సంస్థలు పాలసీదారులకు ఆకర్షించేందుకు తీసుకొచ్చే సరికొత్త పాలసీలను అడ్డుకోవాలంటూ ఐఆర్డిఏఐ కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎల్ఐసి కి సంబంధించి 23 పాలసీలు వద్దు కావచ్చు అని టాక్ వినిపిస్తోంది. రద్దు కాబోయే పాలసీల లిస్ట్ లో ముఖ్యంగా సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీ బ్యాక్ 20 ఇయర్స్, న్యూ జీవన్ ఆనంద్, అన్మోల్ జీవన్ 2, లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్, జీవన్ లక్ష్య, జీవన్ తరుణ్, జీవన్ లాభ్, న్యూ జీవన్ మంగల్, భాగ్య లక్ష్మీ ప్లాన్, ఆధార్ పిల్లర్, ఆధార్ శిల, జీవన్ ఉమాంగ్, జీవన్ శిరోమని, బీమా శ్రీ, ఎల్ఐసీ మైక్రో సేవింగ్స్ వంటి పాలసీలు..  ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పాలసీల రద్దుకు సంబంధించి ఇప్పటివరకు  ఎలాంటి స్పందన  ఇవ్వలేదు ఎల్ఐసి. దీంతో పాలసీ లను రద్దుచేసి ఆ పాలసీల స్థానాల్లో కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం ఉంది అంటూ నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: