ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి విచిత్రమే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మేకకు పుట్టిన మేకపిల్ల మనిషిలా ఉండటంతో ఆ మేక దేవుడి రూపమని నమ్మి అక్కడి స్థానికులు ఆ మేకకు పూజలు చేస్తున్నారు. ఆ మేక పిల్లను చూడటానికి తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలోని నిమోదియాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మేకకు పుట్టిన మేకపిల్ల అచ్చం మనిషి రూపంలో ఉండటంతో పూజలు అందుకుంటోంది. ముఖేష్ ప్రజాపాప్ అనే వ్యక్తికి చెందిన మేక మనిషి ముఖంతో కూడిన మేక పిల్లకు జన్మను ఇచ్చింది. ఈ మేక పిల్ల ముఖం మిగతా మేకల్లా కాకుండా మనిషి ముఖంతో ఉండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే నిమోదియా గ్రామానికి జనం మేక పిల్లను చూడటం కొరకు తండోప తండాలుగా చేరుకుంటున్నారు. స్థానికులు ఆ మేకకు పూజలు చేస్తూ మేక దేవుడి ప్రతిరూపమని నమ్ముతున్నామని చెబుతున్నారు. వైద్య నిపుణులు మాత్రం మేక పిల్ల మనిషి ముఖంతో పుట్టడంలో వింతేమీ లేదని సైక్లోపియా అనే సమస్య వలన జంతువుల్లో ఇలాంటి మార్పులు వస్తాయని చెబుతున్నారు. 
 
ఒక రకమైన జన్యు సమస్య వలన వింత మేక పిల్ల జన్మించిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మేక పిల్ల ముఖం సమాంతరంగా ఉండి ముఖం మనిషి ముఖంలా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ప్రతి 16 వేల జంతువులలో ఒక జంతువుకు ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనుషులకు కూడా ఇలా వస్తుందని జంతువులకు మాత్రమే కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషిని పోలి మేకపిల్ల ముఖం ఉండటంతో ఈ మేక పిల్ల గురించి జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: