అబ్యూజ్డ్, ఫ్రాడ్ లెంట్ మెసేజ్ లు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆపాలని సిఐడి అదనపు డిజిపి సునీల్ కుమార్ అన్నారు. అందుకు సోషల్ మీడియా సంస్ధల సహకారం అవసరమని చెప్పారు.   సోషల్ మీడియా ప్రతినిధులతో 
సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.  ఏ సమాచారం చేరాలన్నాసోషల్ మీడియా వేగంగా వుందని చెప్పారు. దేశంలో 30 కోట్ల మంది సోషల్ మీడియా వాడుతున్నారన్నారు. వదంతులు, సెలబ్రిటీలపై దుష్ప్రచారం, కుల, మత విద్వేషాల రేపే పోస్టులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ పోస్టులపై  ఐటి, ఐపిసి కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.  

తప్పుడు వార్తల పరిణామాలు సమాజంపై  తీవ్రంగా వుంటున్నాయని అదనపు డిజిపి తెలిపారు. ఫాస్ట్ కంటెంట్ ఆపడంలో సోషల్ మీడియా ప్రతినిధుల సహకారం అవసరం...ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అవస్తవాలను ఎలా త్వరితంగా ఆపాలన్నదే మా లక్ష్యం. తప్పుడు వార్తలు వచ్చినపుడు సదరు సోషల్ మీడియాలకు రిక్వెస్ట్ ఎలా పెట్టాలి. న్యాయ నిపుణుల సహకారం ఎలా పొందాలో అవగాహన అవసరం. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాపై ఆధారపటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ముందంజలో ఉన్నాయనే చెప్పాలి. ఈ కోవలో తెలుగు దేశం పార్టీ అగ్రభాగాన నిలుస్తుంది.

ప్రత్యర్థి పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంలోనూ, ప్రజలను తమకు అనుకూలంగా పక్క దరి పాటించే విషయంలోనూ ఈ పార్టీ సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకోడానికి ఒక వేదిక అవసరమని ఈ సమావేశం నిర్వహించాము. ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్స్ తో త్వరలో ఒక సమావేశం పెడతాము. అన్ వెరిఫైడ్ పోస్టులు ఆపాలన్నది మా రిక్వెస్ట్. ఆ మెసేజ్ ఎవరు పెట్టినా ఆపగలగాలన్నదే మా ప్రయత్నం. మోసపూరిత మెసేజ్ సర్క్యులేట్ అయినప్పుడు వాటిని కట్టడి చేయడం అవసరం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: