ప్రతిరోజు కోడి గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటామని.. బలంగా ఉంటామని మన వారు చెప్తూ ఉంటారు. అయితే నిజంగా ప్రతిరోజు కోడి గుడ్డు తింటే ఏం అవుతారు అనేది.. గుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయి అనేది.. గుడ్డు దేనితో సమానం అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

మనం.. రోజు ఎన్నో తింటూ ఉంటాం.. నిజానికి మనం బ్రతికేది తినడం కోసం కాబట్టి ఎక్కువగానే తింటాం. అయితే రోజు పిజ్జాలు అని.. బర్గర్లు అని.. పండ్లు అని.. ఫ్రైడ్ పీస్ అని ఇలా ఏవేవో తింటాం.. ఎందుకు అంటే మనకు నోరు ఉంది రుచి చూడాలి కాబట్టి. కానీ మన నోరు చాల చెడ్డది.. నోరు తింటే శరీరం అంత భారాన్ని మోయాలి.. ఇది గుర్తించుకోండి. 

 

సరే.. అది అంత వదిలేద్దాం.. ఇవి అన్ని తిన్న కూడా.. మనకు బలం రావాలి అంటే రోజుకు ఒక కోడి గుడ్డు అయినా తినాలి. అప్పుడే మనం బలవంతులు అవుతాం.. రోజు 5రూపాయిల కోడి గుడ్డు తింటే 50 రూపాయిల యాపిల్ పండు అవసరం లేదు.. 500 డాక్టరు అవసరం లేదు.. అంటే.. యాపిల్ బలం కోడి గుడ్డులో ఉంటుంది అని.. ఆ బలమే మనకు వస్తే డాక్టరు అనేవారి అవసరమే ఉండదు. 

 

యాంటీఆక్సిడెంట్లు గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి వాటి బారినపడకుండా కాపాడతాయి. అయితే కోడి గుడ్డులో యాంటీఆక్సిడెంట్లు కావాల్సినన్ని ఉంటాయి. అందుకే కోడి గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప‌రిశోధ‌న‌లు చెప్తున్నారు. వారానికి అయిదు సార్లు గుడ్డు తిన్నా గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుంది.. 

 

అంతేకాదు.. గుడ్డు తినేవారిలో గుండెపోటు ముప్పు 26 శాతం తక్కువగా ఉంటుందట.. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా మన శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఓ కోడి గుడ్డు తీసుకోవాలని పరిశోధకులు చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: