ప్రాణాంతక కరోనా వైరస్ సౌదీలో పనిచేసే భారత్ లోని కేరళకు చెందిన ఒక నర్సుకు సోకింది. కేరళ ప్రాంతానికి చెందిన నర్సు వృత్తిరిత్యా సౌదీ అరేబియాలోని అల్ హయత్ హాస్పిటల్ లో పని చేస్తుంది. కరోనా వైరస్ సోకిందేమో అనుమానంతో నర్సు పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. భారత విదేశాంగ మంత్రి వీ మురళీధరన్ సౌదీలో పని చేసే కేరళ నర్సుకు వైరస్ సోకిన విషయాన్ని ధ్రువీకరించారు. 
 
కేరళకు చెందిన చాలా మంది మహిళలు ఎక్కువగా సౌదీలో నర్సులుగా పని చేస్తున్నారు. భారత్ కు చెందిన నర్సులలో చాలా మంది పరీక్షలు చేయించుకోగా కేరళకు చెందిన ఒక నర్సుకు వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. నేషనల్ హాస్పిటల్ లో వైరస్ సోకిన నర్సు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. విదేశాంగ శాఖ మంత్రి జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులతో కేరళ నర్సుకు వైరస్ సోకిన అంశంపై మాట్లాడినట్టు సమాచారం. 
 
కాన్సులేట్ అధికారులు నేషనల్ హాస్పిటల్ యాజమాన్యంతో మరియు సౌదీ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. విధేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ ఘటన గురించి లేఖ రాశారు. సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వైరస్ సోకిన నర్సుకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
చైనాలో ఇప్పటివరకు 634 మందికి వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించగా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. భారత ప్రభుత్వం వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రముఖ విమానశ్రయాల్లో విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చైనాలోని భారత రాయబార కార్యాలయం వైరస్ కు సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వానికి చేరవేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: