ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు రాజధానుల ఏర్పాటుకు వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో పాస్ అయిన తర్వాత కూడా శాసనమండలిలో టిడిపి అడ్డుకోవడం సీఎం జగన్ మోహన్ రెడ్డి కి తీవ్రమైన ఆగ్రహాన్ని చెప్పినట్లు ఉంది. అందుకే మండలి రద్దు పై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన జగన్ రాజధాని అంశం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు భారత రాజ్యాంగంలో రాజధాని విషయమై గ్రౌండ్ రియాలిటీ ని అందరూ ఆశ్చర్యపడే రీతిలో జగన్ వివరించిన తీరు ప్రశంసనీయం.

 

ఇంతకీ జగన్ వాదన ఏమిటంటే శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ... దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అది ఉందంటే దాని యొక్క అవసరం ఏ పార్టీతో అందరూ అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యవస్థ సలహాలు, సూచనలు ఇవ్వకపోగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితికి దారి తీస్తే అటువంటి మండలి మనకి అవసరమా అని జగన్ ప్రశ్నించారు. ఇకపోతే రాజధాని విషయానికి వస్తే అసలు రాజ్యాంగంలో 'క్యాపిటల్' అన్న పదమే లేదు అని జగన్ చెప్పుకొచ్చారు. మరి ఇంతకూ దాని గురించి ఏదో ఒక విషయం రాజధానిలో పొందుపరచి ఉండాలి కదా అని మీకు సందేహం రావచ్చు. 

 

అలాంటి వారి కోసమే జగన్ మాట్లాడుతూ 'సీట్ ఆఫ్ గవర్నెన్స్' అనగా పరిపాలించే వ్యక్తి ఉండే చోటు అని మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావించారు కానీ ఎక్కడ రాజధాని అనే అంశం తెర మీదకు రాలేదు అని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందేలా పరిపాలన వికేంద్రీకరించే స్వేచ్ఛ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అధికారమని... రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చుని పరిపాలన చేయొచ్చు అని జగన్ అన్నాడు. ఇది చట్టాల్లో నిజంగానే స్పష్టంగా వివరించి ఉంది. జయలలిత గారు మన బ్రతికున్నప్పుడు ఊటీ నుంచి పరిపాలన కొనసాగించడంతో పాటు హుద్ హుద్ తుఫాను  వచ్చినప్పుడు చంద్రబాబు కూడా పది రోజులు వైజాగ్ లోనే ఉన్నారు. అంటే అప్పుడు పరిపాలన అక్కడినుంచి జరిగింది కాబట్టి అది రాజ్యాంగ పరంగా ఆమోదయోగ్యమే.

 

ఇప్పుడు జగన్ ఈ బిల్లును ఆపేందుకు టిడిపి వారు వేసిన ఎత్తుకి చాలా ప్రభావవంతమైన రీతిలో పై ఎత్తు చేసే పనిలో ఉన్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ కనుక తాను ఉన్నచోటు నుండే పరిపాలన... రాజధాని లేదు.. ఏం లేదు అంటుంటే తెదేపా వారికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఇక రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎటువైపు దారి తీసుకుంటాయో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: