జగన్ మొదటి నుంచే తన మూడు రాజధానిలో నిర్ణయంపై చాలా ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. శాసనసభలో కూడా అదే దూకుడుని ప్రదర్శించి మూడు రాజధానులు బిల్లులను ఆమోదించుకున్న అతను మండలిలోనూ ఆమోదముద్ర వేయించుకుని రాజధాని వికేంద్రీకరణ దిశగా ఎటువంటి అడ్డూ లేకుండా ఉండేలా చూసుకోవాలని భావించాడు. వైసీపీ ప్రభుత్వం 151 మంది సభ్యులతో శాసనసభలో తిరుగులేని ఆధిక్యత చూపించినప్పటికీ శాసనమండలిలో మాత్రం టిడిపి ఆధిపత్యం ఉండడం వల్ల జగన్ జోరుకు కళ్లెం పడింది.

 

అయితే అసలు ఇది అంతా ఎలా జరిగింది అని ఒకసారి చరిత్రని మనం గుర్తు చేసుకుంటే విధాన పరిషత్ అని పిలవబడే ఈ శాసన మండలి 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. అయితే 1985లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆయన ఎదుర్కోవడంతో దానిని అప్పుడు రద్దు చేశారు. సరిగ్గా అప్పుడు కూడా శాసనసభలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ మండలిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ వారి బిల్లులను పదే పదే తిప్పి పంపేది. 

 

అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక మండలిని తిరిగి పునరుద్ధరించాలని భావించారు. దాంతో 2007లో శాసన మండలి కొలువుదీరింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మిత్రుడైన చంద్రబాబుకు వైఎస్ తిరిగి ఏర్పాటుచేసిన శాసనసభ మండలి 3 రాజధానుల విషయంలో ఒక బ్రహ్మాస్త్రంగా మారగా అతని కొడుకు అయిన జగన్ కు మాత్రం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అయితే 2021 జూన్ వరకూ మండలిలో టిడిపి ఆధిపత్యమే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక ఏడాదిన్నరపాటు జగన్ ఓపిక పడితే మండలిలోనూ వైఎస్సార్సీపీ బలం పెరుగుతుంది కానీ జగన్ అంత ఓపిక గా వ్యవహరించే పరిస్థితి అయితే ఇప్పటి కనపడడం లేదు.

 

ఇప్పుడు అతను మండలి రద్దు కే మొగ్గు చూపుతుండగా దీనికి పార్లమెంటు అంగీకారం ఖచ్చితం. అయితే ఈ విషయంపై పార్లమెంటు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది కేంద్రం ఆసక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఎంతైనా వైయస్సార్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు జగన్ ను ఇరకాటంలో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: