రాజకీయల్లో శత్రువులుగా ఉన్న వారు మిత్రులవడం. మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా మారడం, సామాన్య ప్రజలకు వింతేమో గానీ,రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అసలు సిగ్గుపడే తత్వం మన నాయకులకు ఉండదు. అప్పుడే తిట్టుకుంటారు, కారాలు మిరియాలు నూరుకుంటారు. అంతలోనే భుజాలమీద చేతులేసుకుని మా మధ్య ఏం జరుగలేదు అన్నంతగా కలిసిపోతారు. ఇదే రాజకీయం.

 

 

ఇకపోతే ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనాలు పుట్టించే వార్త ఒకటి బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక బలవంతున్ని ఎదుర్కోవాలంటే, అంతకంటే ఎక్కువగా ప్రత్యర్ధి బలమైన వాడిగా మారాలి. ఇప్పటికే ఏపి రాజకీయాల్లో టీడీపీ పార్టీ బలహీనమైన పార్టీగా మారిపోయింది. జగన్ సీయం అయిన తర్వాత చంద్రబాబు బలాన్ని ఒక్కొక్కటిగా పాతరేసారు. ఇప్పుడున్న పరిస్దితిల్లో బాబు ఒకవైపు పార్టీ ప్రతిష్ట కాపాడుకోవడమా లేక చేయిజారిపోతున్న నాయకులను రక్షించుకోవడమా. తెలియని పరిస్దితుల్లో తన బుద్ధికి పదును పెట్టాడనిపిస్తుందట.

 

 

అదేమంటే పొత్తులు లేని సంసారం పొట్రాయి వంటిదని అనుకున్న బాబు పవన్ కళ్యాణ్‌తో పెట్టుకున్న పొత్తు అంతగా పండలేకపోయిందని ఆలోచించి ఇంకోసారి బీజేపీతో జతకట్టేందుకు సమాయత్తమవుతున్నారా.? అంటే, అవుననే అభిప్రాయాలు టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల్ని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చాలా నిశితంగా పరిశీలిస్తున్న మాట వాస్తవం. పైకి మాత్రం ‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో కేంద్రానికి సంబంధం వుండదు’ అని చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.

 

 

ఈ పరిస్దితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఢిల్లీలో తనకు అత్యంత సన్నిహితులైనవారిద్వారా ప్రధాని నరేంద్ర మోడీతోనూ, ఇంకో వైపు అమిత్‌ షాతోనూ రాయబారానికి ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా గుసగుసలు గుప్పుమంటున్నాయి. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంకొందరు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వ్యవహారం మొత్తం అతి త్వరగా పూర్తవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి: