అభివృద్ధి ఒకేచోట ఉంటె మిగతా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయని చెప్పి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.  ఇలా తెరమీదకు తీసుకొచ్చిన ఈ అంశం చాలా మంది మెచ్చుకున్నారు.  అయితే, కొంతమంది వ్యక్తులు దీనిని తప్పుపడుతున్నారు.  తప్పు పట్టడం సహజమే.  దానిని ఎవరూ కాదనలేరు.  ప్రజాస్వామ్య దేశంలో ఒకరు తప్పు చేస్తే మరొకరు తప్పు చేయకుండా ఉంటారు అనుకోవడానికి వీలు లేదు.  


తప్పులనేవి జరుగుతూనే ఉంటాయి.  ఆ తప్పులు ఎంతవరకు జరుగుతున్నాయి.  ఎలా జరుగుతున్నాయి.  ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు తప్పు అనుకున్న రేపు రైట్ కావొచ్చు.  ఆరోజున మూడు రాజధానుల అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఉన్నందుకు రేపు బాధపడాల్సి రావొచ్చేమో కదా ఎవరు చెప్పొచ్చారు.  మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.  అసలు జగన్ విశాఖకు రాజధానిని మార్చాలి అనుకోవడం వెనుక ఓ స్వామిజీ కూడా ఉన్నారని కొందరు అంటున్నారు.  


అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.  అయితే, ఇప్పుడు అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలని చెప్పి కొంతమంది శ్రీపాశుపత సంపుటీకరణ మాహాకాళభైరవ యాగం చేస్తున్నారట.  ఈ యాగం పూర్తయ్యే రోజున సుమారు లక్షమందితో విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తామని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్తున్నారు.  యాగాలు అన్నవి మంచివే.  పురాణాల కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి.  కెసిఆర్ ప్రతి ఏడాది ఓ యాగం చేయిస్తునే ఉంటారు.  


బహుశా ఆ యాగ ప్రాభవం కారణంగానే అయన ఇంకా ఆ పదవిలో ఉన్నారని కూడా అనుకోవచ్చు.  అయితే, ఈ పాశుపత యాగం ఎంతమేరకు సఫలం అవుతుందో చూడాలి.  ఈ యాగం ప్రాభవం జగన్ పై చూపించి జగన్ నిజంగానే మనసుమార్చుకుంటే, మరలా యాగాలకు మంచి రోజులువచ్చినట్టే.  నిజంగానే యాగం ప్రభావం మనిషిపై ఉంటుందని నమ్మాలి.  యాగాలు జరిగితే అన్ని రకాలుగా మేలు చేసినట్టు అవుతుంది.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: