టర్కీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం టర్కీలో వివాదాస్పదమవుతోంది. టర్కీ ప్రభుత్వం అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటే శిక్ష నుండి మినహాయింపు ఇస్తామనే వివాదాస్పద నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అమలు దిశగా బిల్లును కూడా రూపొందించింది. మ్యారీ యువర్ రేపిస్ట్ పేరుతో రూపొందిన బిల్లుపై టర్కీ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మైనర్ బాలికలను రేప్ చేసిన వారే పెళ్లి చేసుకుంటే శిక్ష మినహాయింపు ఇస్తామని ప్రకటన చేసింది.     
 
ఈ నెలాఖరులో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ప్రకటన చేయగా ప్రతిపక్షాలు ఈ బిల్లుపై మండిపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ వివాదాస్పద బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ఇలాంటి బిల్లుల వలన అత్యాచారాలకు కూడా చట్టబద్ధత కల్పించినట్లవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ బిల్లు అమలులోకి వస్తే మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగే అవకాశం ఉందని అత్యాచారాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందని తేల్చింది. 
 
ప్రభుత్వం ఇలాంటి బిల్లును ప్రవేశపెడితే ఇష్టం లేకపోకపోయినా రేపిస్టులను పెళ్లి చేసుకోవాలని బాలికలపై ఒత్తిడి పెరుగుతుందని నచ్చిన బాలికలను పెళ్లి చేసుకోవడానికి బాలికలపై దాడులు పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వెంటనే ఈ బిల్లును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. 
 
గతంలోనే టర్కీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టింది.15 సంవత్సరాల వయస్సులోపు అత్యాచారానికి గురైన బాధితులను రేపిస్టు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి ఒత్తిడులు, బెదిరింపులు లేకుండా బాలికల అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. కానీ గతంలో బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం మైనర్ బాలికల వయస్సును 15 నుండి 18 సంవత్సరాలకు పెంచుతూ బిల్లును ప్రతిపాదించింది. ఈ వివాదాస్పద బిల్లు బాలికపై అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా ఉందంటూ తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: