మామ అంటే తండ్రితో సమానం. అంటారు కానీ ఈరోజుల్లో ఇలాంటి పవిత్రమైన పదాలకు, బంధాలకు విలువ లేకుండా పోతుంది. దీనికి ప్రధాన కారణం కామం.. కామంతో కళ్లు మూసుకుపోయిన నీచులు, వావి వరసలు మరచి సొంత వారిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం నిజంగా సమాజంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతుంది.. ఎంతలా చట్టాలు చేసిన, ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేసిన ఇలాంటి చర్యలు ఆగడం లేదు.. ఇదిగో ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.. ఆ వివరాలేంటో పరిశీలిస్తే.

 

 

బీహార్ లోని ముజఫర్‌పూర్‌ లో నివాసముంటున్న మహమ్మద్ జాఫర్ కు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అయితే నాలుగేళ్ల సజావుగా సాగిన వీరి వివాహ బంధంలో గత కొన్ని రోజులుగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకానొక సందర్భంలో జాఫర్ తన భార్యపై చెయ్యి కూడా చేసుకున్నాడు. దీంతో ఎంతో క్రుంగిపోయిన ఆమె ప్రతిరోజు చాలా దిగులుగా ఉండేది. ఈ క్రమంలోనే భర్త జాఫర్ పని నిమిత్తం దర్భాంగా జిల్లాకు వెళ్ళిపోయాడు. దీంతో ఈ మహిళ ఒక్కరే ఒంటరిగా ఉండటంతో... జాఫర్ తండ్రి ఆమెపై కన్నేసి, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

 

 

ఈ క్రమంలో అశ్లీల వీడియోలను పంపిస్తూ, నీచమైన పదాలతో, మెసేజ్ చేసేవాడు. కానీ ఆమె తన మామని ఛీ కొట్టింది. అయినా సిగ్గు, శరం లేకుండా..  ఓ అర్థరాత్రి ఆ మహిళ తన గదిలో నిద్రిస్తుండగా.. సదరు మామ కిటికీ దగ్గర తచ్చాడుతు వెగటు పుట్టించే వెకిలి చేష్టలు చేయసాగాడు. ఈ విషయాన్ని గమనించిన అతని కోడలు తలుపు తెరిచి చూడగా తన మామ కనిపించాడు..

 

 

వెంటనే 'మీ సంగతి నీ కొడుకుకి చెప్తా ఆగు', అంటూ ఆమె తన భర్త కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. కానీ తన భర్త మాత్రం తన తండ్రిని సమర్థించాడు. అంతే కాకుండా ఆమెనే తన తండ్రిని రెచ్చగొట్టిందని నీచంగా మాట్లాడాడు. దీంతో చేసేదేమీ లేక ఆమె ఉమెన్ కమిషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఉమెన్ కమిషన్ యువతి భర్త, మామ లను తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: